Vijay deverakonda: ఆ ఒక్క నిర్ణయంతో విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం.. ఏం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకున్నాడు విజయ్.

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా భారీగా పాపులారిటిని సంపాదించుకున్నాడు.టాలీవుడ్ పాటు బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవల హైదరాబాద్ లో ఫేస్ హాస్పిటల్స్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు విజయ్ దేవరకొండ.ఈ నేపథ్యంలోనే ఆర్గాన్స్ డొనేషన్ పై కీలక వాకిలి చేశాడు విజయ్ దేవరకొండ.

Advertisement

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.ఐదేళ్ల క్రితం నేను డాక్టర్ కోసం గూగుల్ లో వెతికా.

నాకు అప్పుడు ఫణి పరిచయమయ్యారు.మా నాన్నకి ఆరోగ్య సమస్యలు ఉండేవి.

అప్పుడు నాన్న కు సర్జరీ చేయడం జరిగింది.ఒకవైపు సర్జరీ మరొకవైపు బిల్లు స్ట్రెస్.

ఆ సమయంలో నా దగ్గర డబ్బులు కూడా లేవు.నేను ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాను.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అప్పుడు డాక్టర్ తో బిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం అని డాక్టర్ తో చెప్పాను.ఇక అప్పటినుంచి నాకు ఫేస్ హాస్పిటల్స్ తో మంచి అనుబంధము ఉంది.

Advertisement

అవయవ మార్పిడి అనేది పబ్లిక్ డోనర్స్ వల్లే జరుగుతుంది అని డాక్టర్ చెప్పేవారు.అందుకే నేను నా ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నాను.సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రికి వెళ్లారు.

అక్కడ ఖర్చులకు భయపడి ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు.కాని కొన్నిసార్లు చెకప్ చేయించుకోవడం మంచిది అని తెలిపాడు విజయ్ దేవరకొండ.

అయితే విజయ్ దేవరకొండ తన ఆర్గాన్స్ డొనేట్ చేశాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విజయ్ అభిమానులు విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా ప్రస్తుతం 70% షూటింగ్ ను పూర్తి చేసుకోగా సమంత రాక కోసం ఎదురు చూడగా సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

సినిమాలో ఇప్పటికే విజయ్ దేవరకొండకు సంబంధించిన సన్నివేశాలు పూర్తికాగా సమంతకు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది.