మెగాస్టార్ టైటిల్ తో వస్తున్న రౌడీ హీరో! త్వరలో షూటింగ్ ప్రారంభం!

టాలీవుడ్ లో వరుస విజయాలతో క్రేజీగా హీరోగా దూసుకుపోతున్న నటుడు విజయ్ దేవరకొండ.

ఫ్యాన్స్ తో ముద్దుగా రౌడీ అనిపించుకుంటున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాని షూటింగ్ చేసే పనిలో వున్నాడు.

ఇదిలా వుంటే దీని తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ జోనర్ లో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళనున్నాడు.ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయకుండానే విజయ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నాడు.

నోటా సినిమా తర్వాత మరో సారి ఏకంగా మూడు భాషలలో ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మూవీకి ఒకే చెప్పేసాడు.ఇక ఈ సినిమా కోసం విజయ్ మెగాస్టార్ మూవీ టైటిల్ హీరోని వాడుకుంటున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 9గా నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ ని ఏప్రిల్ 22న ఢిల్లీలో స్టార్ట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఇక తెలుగు, తమిళం, మలయాళీ భాషలలో ఏక కాలంలో తెరకెక్కే ఈ సినిమాలో సౌత్ ఇండియన్ కి చెందిన స్టార్ట్ కాస్టింగ్ ని తీసుకోవడానికి దర్శకుడు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో వున్న ఈ సినిమా కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో దర్శకుడు వున్నట్లు తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో మరోసారి అర్జున్ రెడ్డి భామ శాలిని పాండే దేవరకొండతో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మీ దంతాలు పసుపు రంగులో అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే ముత్యాల్లా మెరుస్తాయి!
Advertisement

తాజా వార్తలు