Vijay devarakonda : ఇక విజయ్ దేవరకొండ రూటు సపరేట్… అరడజన్ ప్రాజెక్ట్స్ రెడీ

లైగర్ సినిమా( Liger Movie ) కోసం చాల కసరత్తులు చేసి ఏళ్లకు ఏళ్ళు వెయిట్ చేసిన విజయ్ దేవరకొండ ( Vijay devarakonda )ఆ తర్వాత ఖుషి సినిమా కోసం కూడా చాల టైం పెట్టాడు.

ఇక ఇలా ఏళ్ళ తరబడి ఒకటి రెండు సినిమాలు తీయడం అంటే కెరీర్ రిస్క్ లో పెట్టుకోవడమే అనే విషయాన్నీ ఆలస్యం అవ్వకుండానే గ్రహించేసాడు విజయ్.

అందుకే ఇక లైన్స్ అన్ని ఓపెన్.ఎవరు కథ చెప్పిన వినేస్తాను అంటూ రెడీ అవుతున్నాడు.

అందుకే ఇప్పుడు ఏకంగా ఆరు సినిమాలను ఒకే చేసి నెక్స్ట్ ఇయర్ కి రెడీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు.ఇక విజయ్ కోసం నిర్మాతలు మరియు దర్శకులు కూడా క్యూ కడుతున్నారు.

మొన్న వచ్చిన ఖుషి ( Kushi Movie )పర్వాలేదు అనిపించడం తో 2024 లో మినిమమ్ మూడు సినిమాలు విడుదల చేయాలనీ దర్శకులను డిమాండ్ చేస్తున్నాడు విజయ్.ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం సగానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది.సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కూడా షూటింగ్ వేగంగానే జరుగుతుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే శ్రీలీల తప్పుకోవడం తో ఆ స్థానంలో రష్మిక వచ్చి చేరింది.

ఆ తర్వాత దిల్ రాజు పరశురామ్ సినిమ( Parasuram movie ) మాత్రమే కాకుండా మరొక రెండు సినిమాలకు కూడా డేట్స్ బ్లాక్ చేసుకున్నాడు విజయ్ దగ్గర నుంచి.

ఇవి మాత్రమే కాదు రాజా వారు రాణి వారు ఫెమ్ రవి కిరణ్ కొలను కి సైతం ఒక సినిమా ఒకే చేసాడు విజయ్ దేవరకొండ ( Vijay devarakonda ).ఇక మైత్రి మూవీస్ కి టాక్సీ వాలా డైరెక్టర్ రాహుల్ ( Director Rahul )తో ఒక సినిమా, ఇంద్రగంటి తో ఒక సినిమా కమిట్ అయ్యాడు.ఒక మలయాళ డైరెక్టర్ సినిమాకు కూడా కమిట్ అవుతున్న విజయ్ మొత్తని అర డజన్ ప్రాజెక్ట్స్ కి పైగానే లైన్ లో పెట్టేసాడు.

ఇవన్నీ చూస్తుంటే మరో మూడేళ్లు విజయ్ డైరీ లో ఒక్క డేట్ కూడా ఖాళీ లేదు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు