వరల్డ్ ఫేమస్ లవర్‌ ధాటికి విజయ్‌కు రెండు ఎదురుదెబ్బలు

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమికుల రోజు కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డ సినిమా మాత్రం కమర్షియల్ సక్సెస్ కాలేదు.

దీంతో ఈ సినిమా కలెక్షన్లు చాలా దారుణంగా వచ్చాయి.వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ కావడంతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

కాగా ఇప్పుడు భారీ నష్టాలను మిగిల్చే దిశగా ఈ సినిమా వెళ్తుండటంతో హీరో విజయ్ దేవరకొండ నిర్మాతకు కొంత మొత్తంలో రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యాడట.ఈ సినిమా దెబ్బ మరో సినిమాపై కూడా పడినట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హీరో అనే సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు.

Advertisement

అయితే ఈ సినిమా ఔట్‌పుట్ సరిగా రాకపోవడంతో ఈ సినిమాను అటకెక్కించేందుకు చిత్ర దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో విజయ్‌కు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.8 కోట్లను తిరిగి ఇచ్చేయాలంటూ నిర్మాతలు కోరుతున్నారట.మరి వరల్డ్ ఫేమస్ లవర్ దెబ్బ విజయ్ దేవరకొండకు రెండు నష్టాలను మిగిల్చిందనే వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు