అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తానంటున్న విజయ్‌ దేవరకొండ

‘అర్జున్‌ రెడ్డి’, ‘గీతా గోవిందం’ చిత్రాలతో యూత్‌ ఐకాన్‌గా మారిపోయిన విజయ్‌ కు యూత్‌లో యమ ఫాలోయింగ్‌ ఉంది.

క్రేజీ స్టార్‌గా విజయ్‌కు 2018 బాగా కలిసి వచ్చింది.

ఇక 2019 ఎలా ఉంటుందో విజయ్‌ క్లారిటీ ఇచ్చాడు.ఇప్పటికి విజయ్‌ నటించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువే అయినా కూడా స్టార్‌ డంను సొంతం చేసుకున్నాడు.

ఈయన నటించిన చిత్రాల్లో ఒకదానిక ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి.దాంతో అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఇక ఈ ఏడాదిలో కూడా విభిన్నమైన చిత్రాలను చేసి అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వనున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.అభిమానులు తన గురించి ఏది ఊహించుకోకుండా థియేటర్‌లో కూచొని సినిమాలు ఎంజాయ్‌ చేయాలని అభిమానులకు సూచించాడు.కాగా టాలీవుడ్‌లో ఇది వరకు ఏ హీరో కనిపించని గెటప్‌లలో విజయ్‌ కనిపించి, వైవిధ్యభరిత చిత్రాలను చేయాలని ఫిక్స్‌ అయినట్టు విజయ్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం భరత్‌ కమ్మ తెరకెక్కిస్తున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో విజయ్‌ స్టూడెంట్‌గా కనిపించనున్నాడు.స్టూడెంట్‌ లీడర్‌గా సమాజ తీరుపై పోరాటం చేయనున్నాడు.

ఇలా విజయ్‌ చిత్రాలు ఒకదానికొకటి పోలిక లేకుండా ఉండనున్నాయి అని, ఇదే అభిమానులకు ఈ ఏడాది బహుమతి అని విజయ్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు