ట్రైలర్‌ టాక్‌ : ఇదుగో 'లైగర్‌' వచ్చేశాడు

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్‌ దర్శకత్వం లో రూపొందిన లైగర్ సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది.

వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

గత కొన్ని రోజులుగా లైగర్ ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి కూడా అంచనాలు పీక్స్ కు వెళ్లాయి.

హీరోయిన్ గా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటించడం తో పాటు కరణ్‌ జోహార్‌ ఈ సినిమా కు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న నేపథ్యం లో అంచనాలు మరింతగా పెరిగాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది.

విజయ్‌ దేవరకొండ తల్లి పాత్ర లో రమ్యకృష్ణ కనిపించబోతుంది.ముందు నుండి అనుకున్నట్లుగానే ఈ సినిమా లో విజయ్‌ దేవరకొండ నత్తి ఉన్న వ్యక్తి గా కనిపించబోతున్నాడు.

Advertisement

లైగర్‌ గా విజయ్ దేవరకొండ ఓ రేంజ్ లో కుమ్మేయబోతున్నాడు అని ట్రైలర్ ను చూస్తుంటే అనిపిస్తుంది.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఆడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఫైటర్ గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు.ఆయన ప్రేమ కథ మరియు ఆయన ఫైటింగ్‌ సన్నివేశాలు సినిమా కు ప్రధాన ఆకర్షణ గా ఉంటాయని అనిపిస్తుంది.

సినిమా ను ఆగస్టు 25వ తారీకున విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సూపర్‌ స్టార్ గా మారడం ఖాయం అంటున్నారు.

 విజయ్‌ దేవరకొండ ఈ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకుని ఏకంగా రెండున్నర సంవత్సరాలు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు.విజయ్ దేవరకొండ ఈ సినిమా లో చాలా విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్‌ ను చూస్తూ ఉంటేనే అర్థం అవుతుంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఈ సినిమా ఏపాటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే నెల రోజులు ఆగాల్సిందే.

Advertisement