దిల్‌ రాజుతో క్యాన్సల్‌ చేసుకున్న విజయ్ దేవరకొండ.. సితార ఎంటర్‌టైన్మెంట్స్ కి ఓకే

విజయ్ దేవరకొండ కెరియర్‌ ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది.

అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో సక్సెస్ అయ్యానని ఆనందిస్తున్న సమయం లో వరుసగా ఫెయిల్యూర్స్ ఆయన తలుపు తట్టాయి.

అయినా కూడా మంచి అవకాశాలు ఆయనకు దక్కాయి అనడంలో సందేహం లేదు.కానీ ఆ అవకాశాలు కూడా విజయ్ దేవరకొండ కు నిరాశ మిగిల్చాయి.

పూరి జగన్నాధ్‌ దర్శకత్వం లో రూపొందిన లైగర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఆ సినిమా తర్వాత వెంటనే శివ నిర్వాణ దర్శకత్వం లో ఖుషి సినిమా తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ సమంత అనారోగ్య కారణాల వల్ల సినిమా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు, కనీసం షూటింగ్ కూడా పూర్తి కాలేదు.ఈ నెలలో సమంత షూటింగ్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

Advertisement

మరో వైపు పరశురామ్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాణం లో ఒక సినిమా ను అధికారికంగా ప్రకటించారు.కానీ ఇప్పటి వరకు ఆ సినిమా కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు.అల్లు అరవింద్ మరియు పరశురాం మధ్య ఉన్న గొడవ కారణంగా ఆ సినిమా క్యాన్సిల్ అయింది అనే ప్రచారం జరుగుతుంది.

దిల్ రాజు సినిమా క్యాన్సిల్ అవడంతో వెంటనే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ను చేసేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.ఈ సినిమా కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్‌ జరుగుతోంది.

అయితే దర్శకుడు ఎవరు అనే విషయం లో మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతోంది.రాబోయే రెండు నెలల్లోనే సినిమా కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించే రెగ్యులర్ షూటింగ్ కి కూడా వెళ్లే ఆలోచనలో విజయ్ దేవరకొండ ఉన్నాడని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన సినిమాలకు మంచి స్పందన లభిస్తుంది.

కనుక విజయ్ దేవరకొండకు మరో విజయం దక్కుతుందేమో చూడాలి.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?
Advertisement

తాజా వార్తలు