సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.
లైగర్ వంటి ప్లాప్ తో కొద్దిగా నిరాశ చెందిన కూడా ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే బౌన్స్ బ్యాక్ అయ్యి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు.
మరి రౌడీ స్టార్ విజయ్ నటిస్తున్న మూవీల్లో ఖుషి( Khushi Movie ) ఒకటి.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి వచ్చే నెల ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత ( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే వచ్చిన పాటలతో వీరి కెమిస్ట్రీ ఎంత అందంగా ఉందో చూపించడమే కాకుండా మరిన్ని అంచనాలు పెంచేసాయి.
ఇక ఈ మధ్యనే షూట్ కంప్లీట్ కాగా ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు.ఈ సినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు కొద్దిసేపటి క్రితం గుడ్ న్యూస్ చెప్పారు.ఆగస్టు 9న ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.
ఈ పోస్టర్ లో సైతం ఈ జంట కెమిస్ట్రీ ఆకట్టు కుంటుంది.మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
కాగా ట్రైలర్ తో ప్రమోషన్స్ మరింత జోరుగా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.
ఈ లవ్ స్టోరీ విజయ్ కు సమంతకు ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy