విజయ్ దేవరకొండ JGM కు వంశీ పైడిపల్లికి లింక్ ఏంటి..!

ఆల్రెడీ పూరీ జగన్నాథ్ తో లైగర్ సినిమా చేసిన విజయ్ దేవరకొండ ఆ సినిమా రిలీజ్ అవకుండానే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.

పూరీ డ్రీం ప్రాజెక్ట్ అయిన జన గణ మన సినిమాని విజయ్ దేవరకొండ హీరోగా రీసెంట్ గా స్తార్ట్ చేశాడు.

సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.అయితే సినిమాకు పూరీ జగన్నాథ్ మాత్రమే కాదు మరో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తన సపోర్ట్ ఇస్తున్నారని తెలుస్తుంది.

సినిమా సెట్స్ లోకి పూజా హెగ్దేకి వెల్కం చెబుతూ రిలీజ్ చేసిన ఒక వీడియోలో వంశీ పైడిపల్లి పేరు కూడా మెన్షన్ చేశారు.పూరీతో పాటుగా కథలో వంశీ పైడిపల్లి తన సజెషన్స్ ఇచ్చి ఉంటారని చెబుతున్నారు.

సో విజయ్ దేవరకొండ JGM కి కేవలం ఒక డైరక్టర్ మాత్రమే కాదు ఇద్దరు స్టార్ డైరక్టర్స్ పని చేస్తున్నారన్నమాట.లైగర్ రిలీజ్ అవకుండానే పూరీ మీద ఉన్న నమ్మకంతో జన గణ మన సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

Advertisement

లైగర్ తర్వాత శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా పూర్తి కాగానే జన గణ మన కోసం డేట్స్ కేటాయించనున్నాడు.

జన గణ మన తో పూరీ మరోసారి తన సత్తా ఏంటన్నది చూపించాలని ఫిక్స్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు