Vijay Devarakonda DDL Remake: DDL రీమేక్ లో విజయ్ దేవరకొండ..!

బాలీవుడ్ లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చినా ఎవర్గ్రీన్ సూపర్ హిట్ మూవీ అంటూ చెప్పుకునే వాటిలో ముందుంటుంది దిల్వాలే దుల్ హనియా లే జాయెంగే.

ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, కాజోల్ ల జోడీని చూసి ఎన్నో ప్రేమ జంటలు ఒకటయ్యారు.

డీడీఎల్ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు.ఆదిత్య చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ని మళ్లీ ఇప్పటి జెనరేషన్ కి తగినట్టుగా కథ సిద్ధం చేసి మళ్లీ డీడీఎల్ ని రీమేక్ చేయబోతున్నారట.

ఇక ఈ సూపర్ హిట్ మూవీ రీమేక్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తాడని టాక్.ఇప్పటికే ఆదిత్య చోప్రా విజయ్ ని కలిసి సంప్రదింపులు చేస్తున్నారని టాక్.

విజయ్ కనుక డీడీఎల్ రీమేక్ చేస్తే హీరోయిన్ గా శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ని తీసుకుంటే బెటర్ అని అంటున్నారు ఆడియన్స్.లైగర్ సినిమా తో బాలీవుడ్ ఆడియన్స్ కి వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ఫ్లాప్ అందుకున్న సరే ఇంకా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Advertisement

అందుకే ఓ సూపర్ రీమేక్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు