ట్యాక్సీవాల కంటే ముందే గీత గోవిందం.. దానికి ఏమైంది?

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం తర్వాత వరుసగా పెద్ద చిత్రాలు చేస్తున్నాడు.

ఇటీవలే ‘మహానటి’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన విజయ్‌ దేవరకొండ తన తదుపరి చిత్రంగా ‘ట్యాక్సీవాలా’ను తీసుకు వస్తాడని అంతా భావించారు.

ముందుగా అనుకున్న ప్రకారం ట్యాక్సీవాలా చిత్రం గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కాని ఏదో కారణం వల్ల సినిమా ఆలస్యం అవుతుంది.

జులైలో అయినా ట్యాక్సీవాలా వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆ చిత్రం అస్సలు ఈమద్య కాలంలో వచ్చే అవకాశం లేదనిపిస్తుంది.గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఆ చిత్రం ఎందుకు ఇలా విడుదలకు నోచుకోకుండా పోయింది అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఫస్ట్‌లుక్‌ను గ్రాండ్‌గా విడుదల చేసి, అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్‌ దేవరకొండ సినిమా కోసం విభిన్నంగా ప్రచారం కూడా చేశాడు.

Advertisement

‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదలకు ముందు ఈమద్య ప్రారంభం అయిన ‘గీత గోవిందం’ అనే చిత్రం విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది.పరుశురామ్‌ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మాణంలో అల్లు అరవింద్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది.

ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లు సినిమాపై ఆసక్తిని కలుగజేస్తున్నాయి.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గీత గోవిందం’ చిత్రాన్ని చకచక పూర్తి చేసి విడుదలకు సిద్దం చేస్తున్నారు.మరి ట్యాక్సీవాలా విషయంలో ఎందుకు అలా చేయడం లేదు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

ట్యాక్సీవాలా చిత్రంపై ఆ చిత్ర నిర్మాతకు మరియు దర్శకుడికి నమ్మకం లేక పోవడం వల్లే షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కూడా విడుద వాయిదా వేస్తున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమాను ఎంత కాలం అంటూ ల్యాక్‌కు పరిమితం చేస్తారో చూడాలి.

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘ట్యాక్సీవాలా’ మరియు ‘గీత గోవిందం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ రెండు చిత్రాలు మాత్రమే కాకుండా ‘డియర్‌ కామ్రెడ్‌’ మరియు మరో రెండు చిత్రాలను కూడా చేస్తున్నాడు.

Advertisement

భారీ అంచనాల నడుమ విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రాలు బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.మరి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలను దక్కించుకుంటాయో చూడాలి.

తాజా వార్తలు