కేజిఎఫ్ 2 తో ఢీ కొనటానికి రెడీ అయిన స్టార్ హీరో సినిమా..!!

2018 లో కన్నడ హీరో యాష్ నటించిన కేజిఎఫ్ ఇండియాలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే.

ఇండియాలో రిలీజ్ అయిన ప్రతి చోట బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

దీంతో ఇప్పుడు యాష్ నటిస్తున్న కేజిఎఫ్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా నిన్న కేజిఎఫ్ 2 నుండి తుఫాన్ అనే సాంగ్ రిలీజ్ కావడం తెలిసిందే.

అదరగొట్టే మాస్ బీట్ మ్యూజిక్ తో తుఫాన్ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా రిలీజవుతోంది.

ఇక ఇదే సమయంలో కోలీవుడ్ తలపతి విజయ్ నటించిన బీస్ట్ కూడా రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది.

Vijay Beast Movie Releasing Before Kgf Second Part Kgf 2 , Beast , Salaar , Kgf
Advertisement
Vijay Beast Movie Releasing Before Kgf Second Part KGF 2 , Beast , Salaar , KGF

కేజిఎఫ్ 2 ఏప్రిల్ 14 వ తారీకు విడుదల కానుండగా దానికంటే ఒకరోజు ముందు ఏప్రిల్ 13వ తారీకు బీస్ట్ విడుదల అవటానికి రెడీ అయ్యింది.దీంతో ఈ వేసవిలో బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కావటంతో వార్ రసవత్తరంగా మారింది.ఇద్దరికీ కూడా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో.

కేజిఎఫ్ 2, బీస్ట్ సినిమాలలో ఏది విజయం సాధిస్తుందో అన్నది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది.విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో రిలీజ్ అయినా సాంగ్స్ కూడా బాగా ఆదరణ దక్కించుకోవడం జరిగాయి.

ఇటువంటి తరుణంలో.ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి ఒక రోజు గ్యాప్ తరహాలో రిలీజ్ కావడం సెన్సేషనల్ గా మారింది.

 ఇక ఇదే డేట్ కి ప్రభాస్ .కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.నటిస్తున్న సలార్ రిలీజ్ అవుతున్న తరుణంలో.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద ఇది అతి పెద్ద బాక్స్ ఆఫీస్ వార్ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ముగ్గురు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోలు కావడంతో కేజిఎఫ్ 2, బీస్ట్, సలార్ మూడు సినిమాలలో ఏది హిట్ అవుతుందో.

Advertisement

ఏది ఫట్ అవుతుందో అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

తాజా వార్తలు