సూపర్ స్టార్‌ కు అక్కడ ఘోర పరాభవం.. దారుణ అవమానం

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

తమిళం లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఏకంగా 50 కోట్ల రూపాయలను అప్పుడే రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది.

మొదటి వారం రోజులలో దాదాపు 60 శాతం టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అప్పుడే అమ్ముడు పోయాయి అని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.మరో వైపు సినిమా వసూళ్ల విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

వందల కోట్ల వసూళ్ల ను ఈ సినిమా దక్కించుకుంది అని ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎప్పుడు లేని విధంగా మంచి ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దిల్ రాజు ఈ సినిమా ను భారీగా ప్రమోట్ చేసి విడుదల చేస్తున్నాడు.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేవు. కేజిఎఫ్ 2 విడుదల కాకముందే ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో కచ్చితంగా పాజిటివ్ వైబ్స్‌ వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది.

తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భారీగా వసూళ్లు నమోదు అవ్వగా.ఉత్తరాదిన ఈ సినిమా దక్కించుకున్న అడ్వాన్స్ బుకింగ్ మొత్తం చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

దాదాపు 40 లక్షలు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఉత్తరాదిన సినిమా దక్కించుకున్నట్లు సమాచారం అందుతుంది.ఇటీవల విడుదలైన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమా విడుదలకు ముందే దాదాపు పాతిక కోట్ల ఉత్తరభారతంలో దక్కించుకుంది.

దాంతో పోలిస్తే ఈ మొత్తం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.విజయ్ కి సౌత్ లో ఉన్నంత క్రేజ్ నార్త్ లేదని దీంతో మరో సారి నిరూపితమైంది.

Hair Care Tips Dry Hair : డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement