విడెవండీ బాబు.. ఏకంగా కరెంట్ తీగల మీద పుష్ అప్స్ చేస్తున్నాడు

సోషల్ మీడియాలో రోజూ పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.వినూత్నమైన, వినోదభరితమైన వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ముఖ్యంగా, ఎవరికీ సాధ్యంకాని సాహసాలు, విచిత్ర విన్యాసాలు చేసే వ్యక్తుల వీడియోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంటాయి.ఇలాంటి వీడియోలు చేస్తే ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతుంటాం.

తాజాగా, ఇలాంటి ఆసక్తికరమైన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సాధారణంగా చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని నానా తంటాలు పడుతున్నారు.

రోటీన్‌కు భిన్నంగా ఉండేందుకు ఏ పని అయినా చేసేందుకు అస్సలు వెనుకాడటం లేదు.కొంతమంది తమ పైత్యాన్ని తీసి సోషల్ మీడియాలో పెట్టి మరీ ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలో చాలా మంది బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, మెట్రోలు, జనాల మధ్య (Bus stands, railway stations, metros, among the people)భయంకరమైన స్టంట్‌లు చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు.తాజాగా, ఓ వ్యక్తి ఏకంగా విద్యుత్ స్తంభం(Electricity pole) మీద ఎక్కి మరీ స్టంట్‌లు చేస్తున్నాడు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.సాధారణంగా చాలా మంది జిమ్‌లకు వెళ్లి మంచి బాడీ కోసం రకరకాల స్టంట్‌లు చేస్తుంటారు.

మరికొందరు ఎక్కువ బరువులు ఎత్తుతూ వీడియోలు, రీల్స్ చేస్తుంటారు.కానీ ఈ వ్యక్తి మాత్రం వర్కౌట్స్ కోసం ఏకంగా కరెంట్ పోల్ మీద ఎక్కాడు.

బాగా ఎత్తులో ఉన్న కరెంట్ తీగల మీద కూర్చుని, విన్యాసాలు చేస్తూ అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచాడు.అతను చేసిన పనికి అక్కడున్న వారంతా షాక్ అవుతున్నారు.ఈ స్టంట్ ఎంత ప్రమాదకరమైనదో చెబుతూ, నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

ఇలాంటి స్టంట్లు, ముఖ్యంగా రోడ్లపై లేదా ప్రజల మధ్యలో చేసే సాహసాలు చాలా ప్రమాదకరమైనవే.సాధారణ ప్రజలు ఇలాంటి ప్రయత్నాలు చేయడం ప్రమాదకరం.కాబట్టి, భద్రతా చర్యలను పాటించడం, రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడం ఎంతో ముఖ్యం.

Advertisement

ప్రజలు తక్షణ ఫేమ్ కోసం ప్రాణాలకు ముప్పు కలిగించే పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.

తాజా వార్తలు