వీడియో: ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలాన్ని బతికించేందుకు రోజంతా బకెట్లతో నీళ్లు పోశారు..!

ప్రతియేటా వేల కొద్ది తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇతర సముద్ర జంతువులు ఒడ్డుకు కొట్టుకు వస్తుంటాయి.

అయితే తిమింగలాలు ఒక్కసారి ఒడ్డుకు కొట్టుకు వస్తే అవి మళ్లీ వాటంతట అవే లోపలికి వెళ్లలేవు.

ఇలా ఒడ్డుకు వచ్చే ఈ భారీ సముద్ర క్షీరదాల్లో ఆరోగ్యకరమైనవి ఉంటాయి.అలానే గాయపడిన లేదా చనిపోయినవి ఉంటాయి.

సాధారణంగా ఆరోగ్యకరమైన తిమింగలాలు భారీ అలల ధాటికి ఒడ్డు మీదకు కొట్టుకొని వస్తాయి.అయితే తాజాగా ఒక భారీ తిమింగలం కూడా దురదృష్టవశాత్తు ఒక అల వల్ల ఒడ్డుకు వచ్చింది.

ఇది బతికే ఉండటంతో స్థానికులు అందరూ అయ్యో పాపం అనుకున్నారు.దాన్ని ఎలాగైనా కాపాడాలని కొందరు ముందుకొచ్చారు.

Advertisement

అది చాలా పెద్దగా ఉండటంతో దానిని సముద్రం లోకి తీసుకు పోవడం వారి వల్ల కాలేదు.దీంతో చేసేది లేక ప్రతి ఒక్కరూ బకెట్లు చేతపట్టి దానిపై నీళ్లు పోయడం ప్రారంభించారు.

అలా 19 గంటల పాటు రెస్ట్ తీసుకోకుండా తిమింగలం పై నీళ్లు పోసి దాన్ని బతికించారు.చివరికి ఒక పెద్ద అలా మళ్లీ రావడంతో ఆ తిమింగలం నీటిలోకి వెళ్ళగలిగింది.

ఆ తర్వాత కూడా స్థానికులందరూ దాన్ని ఫాలో అవుతూ అది మంచిగా వెళ్తుందా లేదా అని నిర్ధారించుకున్నారు.ఆ తిమింగలం శక్తి పుంజుకుని సముద్రం లోపలికి వెళ్లేంత వరకు స్థానికులు ఫాలో అయ్యారు.దీనికి సంబంధించిన వీడియో ని కొందరు తమ కెమెరాల్లో బంధించారు.

ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు వీరిని తెగ పొగుడుతున్నారు.

నల్లేరులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఒక జీవి ప్రాణాలను బతికించేందుకు దాదాపు ఒక రోజంతా శ్రమపడిన ఈ హీరోలకు సెల్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు