వీడియో: బాతు పిల్లలతో కుక్కపిల్ల స్నేహం.. నెటిజన్లు ఫిదా..

సోషల్ మీడియాలో వైరలయ్యే యానిమల్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా వేరొక జీవి పిల్లలు ఇంకొక జీవిపై నిద్రిస్తే లేదా ఆడుకుంటే.

ఆ దృశ్యాలను చూసేందుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.గతంలో పంది పిల్లలు చిరుతపులిపై నిద్రించి ఆశ్చర్యపరిచాయి.

అయితే ఇప్పుడు ఒక చిన్న కుక్కపిల్లపై బాతు పిల్లలు నిద్రపోతూ కెమెరా కంటికి చిక్కాయి.ఈ బ్యూటిఫుల్ వీడియో కోట్ల మంది నెటిజన్లను ఫిదా చేస్తోంది.

ఈ వీడియోను @Yoda4ever అనే ట్విట్టర్‌ యూజర్ షేర్ చేయగా.దీనికి ఇప్పటికే ఒక కోటి 50 లక్షలకు పైగా వ్యూస్, 8 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

Advertisement

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే.ఒక చిన్న కుక్కపిల్ల, బాతు పిల్లలు ఒకే దగ్గర ఆడుకుంటూ కనిపించాయి.

ఆ కుక్క పిల్ల తాను కూడా బాతు పిల్లలలో ఒకదాన్ని అని భావిస్తూ వాటి దగ్గరే పడుతుంది.కొంత సమయం తర్వాత ఆ బాతు పిల్లలన్నీ కూడా ఏమాత్రం భయం లేకుండా ఈ కుక్కపిల్ల పై పడుకున్నాయి.

ఈ దృశ్యాన్ని చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.ఇలాంటి ముచ్చటైన సన్నివేశాలు జంతువుల మధ్య మాత్రమే కనిపిస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు.

"మనుషులెవరూ కూడా ఇలా వేరే వారి పిల్లలను తమ మీద పడుకోబెట్టుకోడానికి ఇష్టపడరు.కానీ జంతువులు మంచి మనసుతో వేరే వాటిని తమ అక్కున చేర్చుకుంటాయి.

ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట

అందుకు ఈ వీడియోనే నిదర్శనం" అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

సాధారణంగా యజమానులు పెంచుకునే పక్షులు పెంపుడు పిల్లి, కుక్క, ఇంకా ఇతర జంతువులపై పడుకొని హాయిగా నిద్ర పోతాయి.అలా పక్షులు చాలా ఫ్రెండ్లీగా మెలుగుతాయి.ముఖ్యంగా బాతులు తమకు హాని చేయని జంతువులకు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాయి.

వీటి ఫ్రెండ్ షిప్ చూస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే.ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ క్యూట్ బాతు వీడియో కూడా ఫిదా చేస్తోంది.

దానిపై ఓ లుక్కేయండి.