వీడియో: పారాసైలింగ్ చేస్తూ 70 మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డ వ్యక్తి.. స్పాట్‌డెడ్..

పారాసైలింగ్( Parasailing ) యాక్టివిటీ చాలా రిస్క్‌తో కూడుకున్నది.ఈ యాక్టివిటీలో పాల్గొనేవారు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

యాక్టివిటీ చేసే ముందే కింద పడే ప్రమాదం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి.పారాసైలింగ్ చేయించే సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేస్తూ ఉండాలి.

కానీ థాయిలాండ్‌( Thailand )లోని ఫుకెట్‌లో మాత్రం ఆ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు.దాంతో ఒక 71 ఏళ్ల వ్యక్తి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు.

అతడు చాలా ఎత్తు నుంచి కింద పడిపోయి తీవ్రంగా గాయపడి మరణించాడు.అతను నేల మీదకి పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

@FAFO_TV షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 98 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ సంఘటన గురించి తెలిసిన కొందరు కొన్ని వివరాలను పంచుకున్నారు.వారి ప్రకారం చనిపోయిన వ్యక్తి పేరు రోజర్ జాన్ హస్సీ( Roger John Hussey )అతను ఒక ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త.2017లో థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో తన భార్య బుడ్సాబాంగ్ థోంగ్‌సాంగ్కాతో కలిసి సెలవులో ఉన్నప్పుడు పారాసైలింగ్ ప్రమాదంలో మరణించాడు.ఈ జంట తమ వార్షికోత్సవాన్ని జరుపుకున్న చియాంగ్ మాయి నుంచి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కోసం పాపులర్ బీచ్‌కు వెళ్లారు.

ప్రమాదం జరిగిన రోజున, హస్సీ, అతని భార్య కటా బీచ్‌కి వెళ్లారు, అక్కడ వారు పారాసైలింగ్ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.అయితే, అతను 70 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక ప్రమాదం జరిగింది.అతను తీగలు పట్టుకోలేక స్ట్రగుల్ అవుతున్నట్లు కనిపించింది.

అతని భార్య, బీచ్‌కు వెళ్లిన కొందరు అది చూసి భయంతో కేకలు వేశారు, అంతలోనే అతను సముద్రంలో పడిపోయాడు.స్థానిక మీడియా నివేదికల ప్రకారం, హస్సీ అనుకోకుండా ఒక హుక్‌ని లాగాడు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

అదే ఈ ప్రమాదానికి దారితీసింది.పారాసైల్ ఆపరేటర్, బోట్ డ్రైవర్‌ను అరెస్టు చేసి, వారిపై పలికేసులను నమోదు చేశారు.

Advertisement

హస్సీని పటాంగ్ ఆసుపత్రికి తరలించగా, అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.

తాజా వార్తలు