ఢిల్లీలోని ఒక జిమ్‌లో (GYM)జరిగిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
బిలాల్ అహ్మద్ ఖాన్ అనే మేల్ ట్రైనర్ ఓ మహిళను అసభ్యంగా తాకుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
ఆమెకు వ్యాయామం నేర్పిస్తున్నాననే ముసుగులో అతడు ఈ పని చేస్తున్నాడు.ఈ వీడియోలో, ఖాన్ వ్యాయామం చేయడానికి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ మహిళ శరీరాలను అనుచితంగా తాకుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ ఘటన సోషల్ మీడియాలో(Social Media) తీవ్ర విమర్శలకు తావిచ్చింది.అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బిలాల్ అహ్మద్ ఖాన్‌కు ఢిల్లీ కృష్ణ నగర్‌లో సొంత జిమ్ ఉంది.ఈ ప్రాంతంలో ఖాన్‌కు ఇది రెండవ జిమ్ కావడం గమనార్హం.కానీ జిమ్ కి వచ్చిన మహిళ పట్ల అతడు ప్రవర్తిస్తున్న తీరు అందర్నీ షాక్‌కి గురించేస్తోంది.
అతను వివిధ రకాల వర్కౌట్స్ చేయిస్తూ ఆమె తొడ, వెనుక భాగం(Her thigh, her back), టచ్ చేయకూడని చోట అసభ్యంగా తాకుతున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు.ఆ మహిళ వ్యాయామంపైనే దృష్టి పెట్టింది కానీ ట్రైనర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని తెలుసుకోలేకపోతోంది.
ఈ ఘటనపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ ఘటన వల్ల జిమ్‌లలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఢిల్లీలోని (Delhi) ధనవంతులు ఎక్కుగా నివసించే హిందూ ప్రాంతాల్లో మహిళల కోసం మాత్రమే ప్రత్యేకంగా జిమ్‌లు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.ఈ జిమ్‌లు మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తాయని చెబుతున్నారు.కానీ, ఇలాంటి ఘటనలు జిమ్ సిబ్బంది ప్రవర్తనపై తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
ఈ ఘటన తర్వాత జిమ్ యజమానులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.అలానే మహిళలు కూడా ఎవరైనా సరే తమను అసభ్యంగా తాకితే వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy