వీడియో: ఈ బస్సు డ్రైవర్‌ ఇచ్చిన సిగ్నల్స్‌తో పెద్ద ప్రమాదం తప్పింది..?

రాత్రి వేళ హైవేల్లో వాహనం నడుపుతున్నప్పుడు, ముందు వెళ్తున్న వాహనాలను జాగ్రత్తగా గమనిస్తూ వెళ్లడం చాలా ముఖ్యం.ఇలా చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు.

ముఖ్యంగా రెండు వైపుల వెహికల్స్ వెళ్లే టూ లేన్ రోడ్లపై బస్సులు, లారీలు లాంటి పెద్ద వాహనాలు వెళుతున్నప్పుడు, వాటి వెనుక వెళ్తున్న వాహనదారులకు ముందు రోడ్డు కనిపించకపోవచ్చు.అలాంటి సమయాల్లో వెనుక వెళ్తున్న వాహనదారులు ముందు వెళ్తున్న వాహనాల సిగ్నల్ లైట్లను( Vehicle signal lights ) బట్టి రోడ్డు పరిస్థితులను అంచనా వేయాలి.

ఒకవేళ భారీ వాహనాలు తప్పుగా సిగ్నల్స్ ఇస్తే మాత్రం ప్రాణాలు పోతాయని చెప్పుకోవచ్చు.అయితే ఒక వ్యక్తి ఒక బస్సు డ్రైవర్ ఇచ్చిన సిగ్నల్స్ ను గుడ్డిగా నమ్మేశాడు.

సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఆ వీడియోలో ఆ కారు డ్రైవర్ బస్సును ( Car driver bus )దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు కానీ, ముందు రోడ్డు కనిపించక ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు.

Advertisement

ఈ కారు డ్రైవర్ ఎదురుగా వాహనాలు వస్తున్నాయో లేవో చూడలేక ఇబ్బంది పడుతున్నట్లు బస్సు డ్రైవర్ గమనించాడు.అప్పుడు బస్ డ్రైవర్ చాలా తెలివిగా వ్యవహరించాడు.ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు తన బస్సులోని ఇండికేటర్ లైట్లు వెలిగించాడు.

అంటే, "ఎదురుగా వాహనాలు వస్తున్నాయి, ఇప్పుడు దాటొద్దు" అని కారు డ్రైవర్‌కి సిగ్నల్ ఇచ్చాడు.ఎదురుగా వచ్చే వాహనాలు అన్నీ వెళ్లిపోయిన తర్వాత, బస్ డ్రైవర్ తన బస్సును కుడివైపుకు తిప్పేందుకు సిగ్నల్ ఇచ్చాడు.

అంటే, "ఇప్పుడు నువ్వు నన్ను దాటొచ్చు" అని చెప్పినట్లే.కారు డ్రైవర్ కూడా అదే చేసి సురక్షితంగా బస్సును దాటాడు.

ఈ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసిన తరువాత ఒక కోటి మందికి పైగా చూశారు.1,10,000 మంది లైక్ కొట్టారు. ఈ వీడియోలో బస్ డ్రైవర్ చేసిన మంచి పనికి అందరూ అభినందనలు తెలిపారు.

తొలి ప్రయత్నంలోనే గ్రూప్1 సాధించిన గిరిజన యువతి.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
ఇదేందయ్యా ఇది.. ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు.. చివరకి?

అయితే ఒకవేళ ఆ బస్సు డ్రైవర్ ఇచ్చిన సిగ్నల్ కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే ఏంటి పరిస్థితి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.బస్సు డ్రైవర్ తప్పిచేసినా ఇతడి ప్రాణాలు పోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Advertisement

ఇలాంటి రోడ్లపై ఓవర్‌టేక్‌లు చేయకపోవడమే మంచిది అని మరి కొంతమంది హితవు పలికారు.బస్సు డ్రైవర్ స్కిల్స్‌ను కొంతమంది ప్రశంసించారు.

కారు డ్రైవర్ బస్సు డ్రైవర్ కి ధన్యవాదాలు చెప్పి ఉండాల్సింది అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

తాజా వార్తలు