వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలి.. ప్రముఖ నటి క్రేజీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు ప్రభాస్(prabhas).

అంతేకాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.తన పని ఏదో తాను చేసుకుంటూ సోషల్ మీడియాకు అలాగే కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు ప్రభాస్.

అందుకే ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీలు లేని హీరో ఎవరు అంటే ప్రభాస్ పేరు మొదట వినిపిస్తూ ఉంటుంది.తనపై ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసిన అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటాడు.

అందుకే అందరూ హీరోల అభిమానులు ప్రభాస్ ని ఇష్టపడుతూ ఉంటారు.కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీలు కూడా ప్రభాస్ ని ఇష్టపడుతూ ఉంటారు.

Advertisement

తాజాగా బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ప్రభాస్ (actress zarina wahab, prabhas)పై తనకున్న అభిమానాన్ని వెల్లడించడంతో పాటు కొన్ని వైరల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.అటువంటి మంచి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు.ప్రభాస్ లాంటి వ్యక్తి ఎవరూ లేరు.

వచ్చే జన్మలో తనకు ఇద్దరు కొడుకులు కావాలని, ఒకరు తన కొడుకు సురాజ్ కాగా మరొకరు ప్రభాస్ (Son Suraj, Prabhas)అని ఆమె చెప్పుకొచ్చారు.ఒక తల్లి వచ్చే జన్మలో నాకు ప్రభాస్ లాంటి బిడ్డ కావాలి అనడం,ప్రభాస్ ఎంత గొప్పవాడు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అన్నది అర్థం చేసుకోవచ్చు.

షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎలా ఉంటారు అనే విషయంపై చాలామంది సెలబ్రిటీలు మాట్లాడిన విషయం తెలిసిందే.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఇక ప్రభాస్ వారికి ఇచ్చే గౌరవం, ఇంటి నుంచి తెప్పించే ప్రత్యేకమైన భోజనం గురించి ప్రతి ఒక్కరు గొప్పగా చెబుతారు.అదేవిధంగా జరీనా కూడా షూటింగ్ సమయంలో సెట్స్ లో ఎటువంటి అహం అనేది ప్రదర్శించని నటుడిగా ప్రభాస్ ను వర్ణించారు.అంతేకాదు షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని కలిసిన ప్రభాస్ వెళ్లిపోయే ముందు అందరికీ బై చెప్పి వెళ్తారట.

Advertisement

ప్రభాస్ రోజుకి కనీసం 30నుంచి 40 మంది తినే విధంగా భోజనాలు ఇంటి నుంచి తెప్పిస్తారట.అలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ లో గొప్ప క్వాలిటీస్ ఎన్నో ఉన్నాయి అని జరినా తెలిపారు.

తాజా వార్తలు