ఎన్ డీ ఏ ను గెలిపిస్తేనే బీహార్లో అభివృద్ధా?

అవును .ఎన్ డీ ఏకు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇస్తేనే బీహార్ అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.

ఈ రాష్ట్రంలో ఎన్ డీ ఏను గెలిపిస్తే రాజ్య సభలో బలం పెరుగుతుందని, దాంతో కీలకమైన బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంటుందని అన్నారు.బీహార్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, దేశ అబివృద్ది ఈ ఎన్నికల మీదనే ఆధార పడి ఉందని అన్నారు.

ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రజలు తమకు ఓటు వేయాలని కోరారు.రెండో దశ పోలింగ్ కోసం వెంకయ్య ప్రచారం చేస్తున్నారు.

ప్రజలు ఇతర కూటమిని గెలిపిస్తే అరాచకం ప్రబలుతుందని హెచ్చరించారు.ఒకవేళ గ్రాండ్ అలయన్సు అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ పేరుకే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆయాన్ని వేరేవారు కంట్రోల్ చేస్తారని పరోక్షంగా లాలూ ప్రసాదును ఉద్దేశించి అన్నారు.

Advertisement

ఇక్కడ నితీష్, లాలూ, సోనియా పార్టీలు గ్రాడ్ అలయన్సు పేరుతో పోటీ చేస్తున్నాయి.వెంకయ్య చెప్పింది బీహార్ ప్రజలు వింటారా?.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
Advertisement