స్టార్ డైరెక్టర్ రాజమౌళి జాతకాలను నమ్మరనే సంగతి తెలిసిందే.
నాస్తికుడు అయిన జక్కన్న దేవాలయాలకు కూడా అడపాదడపా వెళతారే తప్ప తరచూ వెళ్లడానికి తరచూ దేవాలయానికి వెళ్లడానికి ఆయన ఇష్టపడరు.
అయితే ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి జాతకానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడని ఆయన సినిమా ప్రమోషన్లు చేసిన విధంగా ఎవరూ చేయరని వేణుస్వామి పేర్కొన్నారు.
రాజమౌళి 10 పైసల సినిమా తీస్తే 100 పైసల పబ్లిసిటీ చేసుకుంటారని సినిమా ఫలితం కూడా పాజిటివ్ గానే వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని నార్త్ ఇండియన్స్ ఈ విషయాన్ని బాగా చెబుతారని వేణుస్వామి కామెంట్లు చేశారు.
ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిందని వేణుస్వామి పేర్కొన్నారు.
అలియా భట్ సినిమాలో హీరోయిన్ కాదని సపోర్టింగ్ క్యారెక్టరే అని సినిమాలో మూడుసార్లు మాత్రమే ఆమె కనిపిస్తుందని వేణుస్వామి వెల్లడించారు.అయితే అలియా భట్ 33 ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్లకు వచ్చిందని వేణుస్వామి చెప్పుకొచ్చారు.ఇదే సినిమా వేరే డైరెక్టర్ తీసి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని రాజమౌళి జాతకంలో అలా ఉందని ఆయన తెలిపారు.
రాజమౌళి సినిమా తీస్తే హీరో పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
రాజమౌళిది కుంభం అని రాజమౌళి డైరెక్షన్ లో నటించే హీరోలు జ్యోతిష్యం చెక్ చేయించుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.చరణ్ కు ఇప్పుడు వచ్చిన ఫేమ్ రాహువు వల్ల వచ్చిందని ఆయన తెలిపారు. ప్రభాస్, రానాలపై రాజమౌళి ప్రభావం పడిందని ఆయన చెప్పుకొచ్చారు.
రాజమౌళి జాతకం గురించి వేణుస్వామి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.గతంలో కూడా పలువురు సెలబ్రిటీల జాతకాల గురించి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy