Astrologer Venu Swamy : మీవి సౌందర్య సినిమాలు నావి సన్నీలియోన్ సినిమాలు.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి( Astrologer Venu Swamy ) గురించి కొన్ని విషయాల్లో విమర్శలు వ్యక్తమైనా ఆయనను అభిమానించే వాళ్లు, ఆయన జాతకాలను నమ్మేవాళ్లు సైతం ఉన్నారు.

తాజాగా వేణుస్వామి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో నాపై మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతోందని వేణుస్వామి వెల్లడించారు.

కవితను అరెస్ట్( MLC Kavitha Arrest ) చేస్తారని ఏడాది క్రితమే నేను చెప్పానని ఆయన పేర్కొన్నారు.వేణుస్వామి చెప్పినవి జరగవని ప్రత్యేకించి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని వేణుస్వామి వెల్లడించారు.

నా గురించి వీడియోలు చేసే అవకాశం, రైట్స్ ఉన్నాయని ట్రోల్స్( Trolls ) చేసే అధికారం కూడా వాళ్లకు ఉందని ఆయన తెలిపారు.

అయితే కొంతమంది జ్యోతిష్కులు కూడా విమర్శలు చేయడం నా దృష్టికి వచ్చిందని వేణుస్వామి అన్నారు.కొంతమంది జ్యోతిష్కులు( Astrologers ) నన్ను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారని ఆయన తెలిపారు.నన్ను విమర్శించాలంటే జ్యోతిష్యం పరంగా విమర్శించవచ్చని వేణుస్వామి పేర్కొన్నారు.

Advertisement

మీరు సాంప్రదాయబద్ధంగా సౌందర్య లాంటి సినిమాల లాంటి వారని నావి సన్నీలియోన్ సినిమాలు అని అన్నానని వేణుస్వామి వెల్లడించారు.నా మందు, నాన్ వెజ్ గురించి అందరికీ తెలుసని నాకు బూతులు మాట్లాడటం కూడా తెలుసని నాలో ఆ యాంగిల్ చూడాలని అనుకోవద్దని ఆయన తెలిపారు.

మీకు దమ్ముంటే ఏపీలో ఎవరు గెలుస్తారో వీడియో చేయాలని వేణుస్వామి వెల్లడించారు.

నేను జాతకంలో( Horoscope ) ఏవైనా తప్పులు చెప్పి ఉంటే అప్పుడు జ్యోతిష్కులకు విమర్శించే అవకాశం ఉంటుందని వేణుస్వామి పేర్కొన్నారు.వేణుస్వామి చేసిన కామెంట్లు( Viral Comments ) నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.వేణుస్వామి ఏపీ ఎన్నికలకు( AP Elections ) సంబంధించి ఒక పార్టీకి అనుకూలంగా చెప్పగా ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

వేణుస్వామి చెప్పిన జాతకాలు కొంతమంది విషయంలో నిజమైతే మరి కొంతమంది విషయంలో మాత్రం నిజం కాలేదు.వేణుస్వామి ఫీజు కూడా భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement