మామ అల్లుడు రావడంకు ముహూర్తం ఖరారు.. సాహో, సైరా మద్యలో వీరి సందడి

చాలా సంవత్సరాలుగా మామ అల్లుడు అయిన వెంకటేష్‌ మరియు నాగచైతన్యల కాంబో మూవీ కోసం అక్కినేని మరియు దగ్గుబాటి ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

వీరిద్దరి కాంబోకు ఎట్టకేలకు రంగం సిద్దం అయ్యింది.

రెండు సంవత్సరాలుగా చర్చలు జరుపుకుంటున్న వెంకీమామ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.జైలవకుశ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఈ చిత్రంను సురేష్‌ బాబు నిర్మిస్తున్నాడు.

భారీ అంచనాలున్న ఈ చిత్రంను దర్శకుడు చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది.తాజాగా సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది.మొన్నటి వరకు సినిమాను జులై నెలలో విడుదల చేస్తారంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంను సెప్టెంబర్‌ 13న విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.జూన్‌ నెలలో సినిమా టీజర్‌ను విడుదల చేసి విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

జులై నెలలోనే షూటింగ్‌ పూర్తి అవుతున్నా కూడా ఆగస్టులో సాహో ఉన్న కారణంగా రిస్క్‌ వద్దని భావించి సెప్టెంబర్‌ 13కు ఫిక్స్‌ అయ్యారు.

సాహో విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత వెంకీమామ రాబోతున్నాడు.ఇక సాహో చిత్రం మాత్రమే కాకుండా ఈ చిత్రంను భయపెట్టిన మరో సినిమా సైరా.సైరా చిత్రం అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్బంగా విడుదల కాబోతున్నట్లుగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో దాదాపు మూడు వారాల ముందుగా వెంకీ మామ వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

సాహో మరియు సైరా చిత్రాలకు మద్యలో ఈ చిత్రం రాబోతుంది.ఎఫ్‌ 2 చిత్రంతో భారీ కమ్‌ బ్యాక్‌ అయిన వెంకటేష్‌కు ఇది చాలా ప్రతిష్టాత్మక చిత్రం.ఎందుకంటే చైతూతో మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం అవ్వడం.

How Modern Technology Shapes The IGaming Experience
కాలేయాన్ని శుభ్రం చేసే డ్రైడ్ పపాయ..ఎలా తీసుకోవాలంటే?

ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా పాయల్‌ రాజ్‌ పూత్‌ మరియు రాశిఖన్నాలు నటిస్తున్న విషయం తెల్సిందే.పల్లెటూరు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు