నితిన్ మూవీలో మరో హీరోయిన్.. స్పెషల్ సాంగ్ లో ఆడిపాడబోతుందా?

టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) చేసింది రెండు సినిమాలే అయినా ఈయనకు మంచి క్రేజ్ ఉంది అనే చెప్పాలి.

ఛలో, భీష్మ సినిమాలతో వరుసగా రెండు హిట్స్ అందుకుని ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ముచ్చటగా మూడవ సినిమా కోసం మూడేళ్ళ పాటు గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.వెంకీ కుడుముల మూడవ సినిమాను ఉగాది కానుకగా ప్రకటించిన విషయం తెలిసిందే.

VNRTrio.అనౌన్స్ మెంట్ వీడియో తోనే రచ్చ రచ్చ చేసిన ఈ కాంబో వెంటనే గ్రాండ్ లాంచ్ కూడా జరుపుకుని షూట్ కోసం రెడీ అయ్యింది.

వెంకీ కుడుముల దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నితిన్ (Nithiin) హీరోగా ప్రకటించిన లేటెస్ట్ క్రేజీ మూవీ VNRTrio.ఈ కాంబోలో ఇప్పటికే భీష్మ వంటి సూపర్ హిట్ రాగా ఈ ముగ్గురికి ఘన విజయాన్ని అందించింది.

Advertisement

ఇక ఇప్పుడు ఇదే కాంబోలో మరో మూవీ రాబోతుండడంతో ప్రకటించిన రోజే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఇక తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు రాగ నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట.

మరి టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) ఈ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడ బోతుంది అని వార్త వైరల్ అవుతుంది.

ఇది నిజమో కాదో తెలియదు.ఇక కథ విషయానికి వస్తే ఒక నెలలో చనిపోతాను అని తెలుసుకున్న ఒక వ్యక్తి తన జర్నీని ఎంత హ్యాపీగా మార్చుకున్నాడు? ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు అనే దానిపై వెంకీ సినిమాను తెరకెక్కించ బోతున్నాడు.ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ (GV Prakash) సంగీతం అందిస్తుండగా.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.చూడాలి ఈ కాంబో ఈసారి ఎలా ఉంటుందో.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

తాజా వార్తలు