ప్రభాస్ బ్యానర్‌కు ఓకే చెప్పిన వెంకీ

ఛలో సినిమాతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల, తన రెండో చిత్రంగా యంగ్ హీరో నితిన్‌తో కలిసి భీష్మ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మలిచి తన ఖాతాలో వరుసగా రెండో బ్లాక్‌బస్టర్‌ను నమోదు చేసుకున్నాడు వెంకీ కుడుముల.ఇక భీష్మ చిత్రం సక్సె్స్ కావడంతో వెంకీ కుడుములతో సినిమా చేసేందుకు పలువురు హీరోలతో పాటు ప్రొడక్షన్ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.

అయితే అందరికంటే ముందే, ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ వెంకీ కుడుమలతో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.తమ బ్యానర్‌లో వెంకీ కుడుముల తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశాయి.

ఇక ఈ సినిమాలో హీరో ఎవరనే అంశాన్ని మాత్రం యూవీ క్రియేషన్స్ రివీల్ చేయలేదు.కాగా ప్రభాస్ స్నేహితులకు చెందిన యూవీ క్రియేషన్స్ అటు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలను కూడా తెరకెక్కిస్తూ తమ సత్తా చూపుతోంది.

Advertisement

మరి వెంకీ కుడుముల డైరెక్షన్‌లో యూవీ క్రియేషన్స్ చేయబోయే సినిమా ఏ కోవకు చెందుతుందో తెలియాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు