ఎఫ్‌ 3 ప్లాన్స్‌ తలకిందులు చేసిన వెంకటేష్‌

గత ఏడాది సంక్రాంతికి కానుకగా వచ్చిన ఎఫ్‌ 2 చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఘన విజయం సాధించడంతో ఎఫ్‌2 కు సీక్వెల్‌ ఎఫ్‌ 3ని స్పీడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు అనీల్‌ రావిపూడి భావించాడు.

కాని ఆయన అనుకున్నట్లుగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు.ఎఫ్‌ 3 వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలకు సాధ్యం అయ్యేలా లేదు.

సీక్వెల్‌కు ఇప్పటికే వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌లు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.వీరిద్దరి డేట్లు కలిసే సమయంకు సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు అనీల్‌ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు.

అంతా బాగానే ఉంది, త్వరలోనే షూటింగ్‌కు వెళ్తామని అనీల్‌ రావిపూడి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఎఫ్‌ 3 ఆలస్యం అయ్యేలా ఉంది.అందుకు కారణం వెంకటేష్‌ అంటూ కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement
F3 Sequel Shooting Late Because Of Venkatesh And His Other Works, Venkatesh, Var

నారప్ప సినిమాను వెంకీ పూర్తి చేయాల్సి ఉంది.ఆ సినిమా షూటింగ్‌ను మరో మూడు నాలుగు నెలల వరకు ప్రారంభించే అవకాశాలు లేవని అంటున్నారు.

కరోనా భయం మరియు రానా వివాహ ఏర్పాట్లతో బిజీగా ఉన్న కారణంగా నారప్ప సినిమాను వాయిదా వేశారు.వెంకీ మూవీ నారప్ప పూర్తి అయితే తప్ప ఎఫ్‌ 3 ప్రారంభం అవ్వదు.

F3 Sequel Shooting Late Because Of Venkatesh And His Other Works, Venkatesh, Var

కనుక వచ్చే ఏడాది వరకు షూటింగ్‌కు కూడా ఎఫ్‌ 3 వెళ్లే పరిస్థితి లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో అనీల్‌ రావిపూడి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది.

ఎండల వల్ల మీ ముఖం మెడ నల్లగా మారాయా.. ఈ రెమెడీతో 20 నిమిషాల్లో చర్మాన్ని రిపేర్ చేసేయండి!
Advertisement

తాజా వార్తలు