ఆ హిట్‌ మూవీ సీక్వెల్‌ను వదిలేయలేదంటా

గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఎఫ్‌2 చిత్రంతో వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌లు వచ్చిన విషయం తెల్సిందే.

అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం సక్సెస్‌ అయ్యింది.

సూపర్‌ హిట్‌ అయిన ఆ చిత్రంకు సీక్వెల్‌ చేయబోతున్నట్లుగా ఇప్పటికే దర్శకుడు అనీల్‌ రావిపూడి ప్రకటించాడు.అప్పుడు సినిమా ప్రమోషన్స్‌ సమయంలో అనీల్‌ రావిపూడి ప్రకటించి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మహేష్‌బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాను తీశాడు.

ఇప్పుడు ప్రేక్షకులు మరియు మీడియా వారు ఆ సీక్వెల్‌ గురించి ప్రశ్నిస్తున్నారు.తాజాగా విషయమై వెంకటేష్‌ స్పందించాడు.తప్పకుండా ఆ సీక్వెల్‌ ఉంటుందని చెప్పుకొచ్చాడు.

అనీల్‌ రావిపూడితో సినిమా చేయాల్సి ఉందని, అది సీక్వెల్‌ అవ్వాలని తాను కూడ కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఎఫ్‌ 2 సీక్వెల్‌ చేస్తే వరుణ్‌ తేజ్‌ కూడా తప్పకుండా నాతో నటిస్తాడని ఆశిస్తున్నాను అంటూ వెంకటేష్‌ అన్నాడు.

Advertisement

ఎఫ్‌ 2 చిత్రం సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో సీక్వెల్‌ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

ప్రస్తుతం వెంకటేష్‌ అసురన్‌ రీమేక్‌ చేస్తున్నాడు.నాలుగు నెలల్లో అంటే ఏప్రిల్‌ లేదా మే వరకు రీమేక్‌ పనులు పూర్తి చేయబోతున్నాడు.ఆ తర్వాత అనీల్‌ రావిపూడి దర్శకత్వంలోనే సినిమా ఉంటుందని అంటున్నాడు.

సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదల కాబోతుంది.ఆ వెంటనే అనీల్‌ రావిపూడి స్క్రిప్ట్‌పై కూర్చుని వెంకటేష్‌ కోసం ఎఫ్‌ 2 సీక్వెల్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేయాలని అంతా కోరుకుంటున్నారు.

వీరి కాంబో మూవీని కూడా దిల్‌రాజు నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడు.అయితే ఎవరు సీక్వెల్‌ రైట్స్‌ను దక్కించుకుంటారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు