హిట్ డైరెక్టర్ తో వెంకీ @75.. ఎప్పుడు పట్టాలెక్కేనో..

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు.ఈయన ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు.

అటు మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తూనే ఇటు సోలో హీరోగా కూడా చేస్తూ దూసుకు పోతున్నాడు.ఇటీవలే ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాతో మరో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రెజెంట్ ఈయన ల్యాండ్ మార్క్ సినిమాగా 75వ సినిమా రాబోతుంది.

ఈ సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడా అని ఆయన ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఇప్పుడు చేయబోయే 75వ ప్రాజెక్ట్ ఒక లెక్క.

Advertisement

అందుకే వెంకీ కూడా దీనికి తగ్గట్టుగా ప్రత్యేకమైన సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తుంది.వెంకీ ఇంతకు ముందు స్పీడ్ గా సినిమాలు చేసే వాడు.

కానీ ఇప్పుడు ఈయన సక్సెస్ రేట్ తగ్గడంతో ఆచి తూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు.మల్టీ స్టారర్ సినిమాలు అయినా చేయడానికి ముందు ఉంటాడు.

కానీ ఈయన ఫ్యాన్స్ ఇప్పటికి ఈయన ఘర్షణ, తులసి వంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అని ఆశ పడుతున్నారు.ఇటీవల కాలంలో ఈయన లెవల్ పెంచే ఒక్క సినిమా కూడా రాలేదు.

దీంతో 75వ సినిమా అయినా గ్రాండ్ గా ప్లాన్ చేయాలని కోరుకుంటున్నారు.ఈ ల్యాండ్ మార్క్ మూవీ కోసం కొంత మంది దర్శకులను అనుకోగా వారు సెట్ కాలేదు.ఇక ఇప్పుడు ఈ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ లోకి హిట్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

హిట్ తో ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్టు తెలిపాడు.

Advertisement

అలాగే హిట్ యూనివర్స్ లో వెంకటేష్ ను కూడా తీసుకు రాబోతున్నట్టు తెలుస్తుంది.హిట్ 3 ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.అర్జున్ సర్కార్ గా నాని కనిపించ బోతున్నాడు.

అలాగే శైలేష్ కొలను హిట్ 3 తో పాటు మరి సినిమాను వెంకటేష్ తో చేసేందుకు చర్చలు చేస్తున్నట్టు సమాచారం.సురేష్ బాబు నాని ప్రొడక్షన్స్ తో కలిసి వెంకీ 75వ సినిమాను నిర్మించాలని ఆలోచనలో ఉన్నారట.

మరి ఇదే నిజమైతే దగ్గుబాటి ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ నే అవుతుంది.

తాజా వార్తలు