మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ బాలక్రిష్ణ అంటే తనకెవరో తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
మొదటగా బాలక్రిష్ణ అంటే ఎవరో తెలియదు అని చెప్పిన నాగబాబు ఆ తర్వాత సీనియర్ నటుడు బాలక్రిష్ణ గురించి ప్రస్తావించాడు.
బాలక్రిష్ణ అంటే ఎవరో తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయ్యాయి.స్టఫ్ కోసం ఎదురు చూసే నెటిజన్లకు ఇది మంచి స్టఫ్‌గా దొరికిపోయింది.
సోషల్ మీడియాలో నాగబాబు వ్యాఖ్యలకు రకరకాల మీమ్స్ వచ్చాయి.
నాగబాబు వ్యాఖ్యలపై మెగా కుటుంబం స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలని సోషల్ జనాలు ఆసక్తి కనబర్చుతున్నారు.అయితే మెగా హీరోలకు దీనిపై స్పందించే అవకాశం రాలేదు.తాజాగా ‘అంతరిక్షం’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గోంటున్న వరుణ్ తేజ్‌కు ఈ విషయంపై స్పందించక తప్పని పరిస్థితి.
యాంకర్ పదేపదే అడిగి ఈ ప్రశ్న నుండి సమాధానం రాబట్టాడు.
బాలక్రిష్ణ ఎవరో తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వరుణ్ తేజ్ నాన్న అన్నదాంట్లో తప్పేముంది.గతంలో బాలక్రిష్ణ పవన్‌కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని అన్నారు.ఆ వీడియో నేను కూడా చూశాను.
తన తమ్ముడిని అలా అంటుంటే ఊరికే ఉండను అని ఎప్పుడు అనేవాడు.సో మొన్న ఆ సందర్భం వచ్చింది కాబట్టి అలా అనేశాడు.
నాకు నాన్న దాంట్లో తప్పేమి అనిపించడం లేదు అంటూ వరుణ్ తేజ్ నాగబాబు వ్యాఖ్యలను సమర్థించాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy