సంతాప సభలో వెరైటీగా బెల్లీ డ్యాన్స్ ప్రదర్శన

పెళ్లి వేడుకలోనో, పుట్టిన రోజు నాడో డీజే సాంగ్స్ పెట్టి కుర్రకారు అంతా డ్యాన్స్ చేస్తుంటారు.డ్యాన్స్ రాని వారు సైతం ఉత్సాహంగా కాలు కదుపుతుంటారు.

ఆయా సందర్భాల్లో ఎవరు డ్యాన్స్ చేసినా అభ్యంతరాలేవీ ఉండవు.అయితే సంతాప సభలో కొందరు వెరైటీగా ప్రయత్నించారు.

సల్మాన్ ఖాన్ నటించిన ఓ పాటకు ఉత్సాహంగా చిందేశారు.అంతేకాకుండా ఓ యువతిని రప్పించి, ఆమెతో బెల్లీ డ్యాన్స్ ప్రదర్శన పెట్టించారు.

చనిపోయిన వారి ఇంట ఇదేమిటని అంతా విస్తుపోయారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Advertisement

ఎవరి ఇంట్లో అయినా ఓ వ్యక్తి చనిపోతే అతడిని తలుచుకుని అంతా బాధపడుతుంటారు.అంతిమ యాత్ర సమయంలో కొందరు బాధ మర్చిపోవడానికి కూడా డ్యాన్స్ వేస్తుంటారు.

తాజాగా ఇంటర్నెట్‌లో ఓ సంతాప సభ వీడియో హల్ చల్ చేస్తోంది.సంతాప సభలో అమ్మాయితో డ్యాన్స్ చేయించడమే అక్కడ విశేషం.

ఓ వ్యక్తి మరణించాడు.అతడికి సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.

మృతుడికి నివాళి తెలుపుతూ తమ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు కూడా పెట్టారు.నివాళి సభకు బంధువులు, స్నేహితులు వస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

ఇంతలో వేదికపై పాటలు వినిపించాయి.దీంతో పరామర్శకు వచ్చిన వారంతా ఒక్కసారిగా వేదిక వైపు చూశారు.

Advertisement

పోకిరి హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పాటకు ఓ యువతి స్టేజిపై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుంది.ఆ యువతి చేసే బెల్లీ డ్యాన్స్‌ను అంతా మైమరిచిపోయి చూడడం మొదలు పెట్టారు.

అయితే కొందరు మాత్రం ఈ సంఘటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.చనిపోయిన వ్యక్తి కుటుంబం శోకసంద్రంలో ఉంటే, అక్కడ యువతితో కలిసి బెల్లీ డ్యాన్స్ చేయడమేంటని అంతా ముక్కున వేలేసుకున్నారు.

ఈవీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో విపరీతంగా వైరల్ అయింది.చనిపోయిన వ్యక్తికి బెల్లీ డ్యాన్స్ అంటే ఇష్టం ఉందేమోనని, అందుకే అతడి స్నేహితులు అలా అమ్మాయితో బెల్లీ డ్యాన్స్ ప్రదర్శన ఏర్పాటు చేయించారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అక్కడికి వచ్చిన వారు ఏడవకూడదనే ఉద్దేశంలో అలా చేసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనా కొత్త ట్రెండ్‌‌ను సెట్ చేశారని కొందరు ప్రశంసిస్తూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు