సావిత్రి కొత్త కారు టైర్లు కోయించిన మరొక స్టార్ నటీమణి

సినిమా ఇండస్ట్రీ( Film Industry ) లో చాల సమస్యలు ఉంటాయి.కొన్ని చాల ఈజీ గా బయట పడుతాయి.

కానీ మరి కొన్ని విషయాలు త్వరగా వైరల్ అవుతాయి.ఇప్పుడు అంటే మీడియా హడావిడి ఎక్కువ ఉంది కాబట్టి చీమ చిటుక్కుమన్నా కూడా అందరికి తెలిసిపోతున్నాయి.

కొన్నేళ్ల క్రితం మీడియా ఇలా ఉండేది కాదు.అందుకే విషయాలు ఏమైనా జరిగితే ఏ పేపర్ లో లేదంటే వార పత్రిక లో వస్తే కానీ తెలిసేవి కావు.

అయితే ఆలా మరుగున పడిపోయిన అనేక విషయాల్లో ఒకటి సావిత్రి( Savitri ) ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కొత్త కారు టైర్స్ ని మరొక నటి కోయించడం.

Advertisement

ఇలా చేసిన ఆ మరో నటి ఎవరంటే జి.వరలక్షి( G Varalakshmi ). సావిత్రి కి కారు టైర్స్ కోయించడానికి వరలక్ష్మి కి సంబంధం ఏంటి అంటే జ్యోతి సినిమాలో వీరిద్దరు కలిసి నటించిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది.ఆ టైం లో జి వరలక్ష్మి షాట్ కి వస్తుంది అని అందరు ఎదురు చూస్తున్నారు.

ఆమె మేకప్ వేసుకోవడం లో బిజీ గా ఉంది.అప్పటికే సావిత్రి రెడీ అయ్యి సెట్ కి వచ్చి తన షాట్ కోసం ఎదురు చూస్తుంది.

ఈ సినిమా కి సినిమాటోగ్రఫేర్ గా చంద్రన్( Cinematographer Chandran ) పని చేస్తున్నారు.సరిగ్గా వెనక నుంచి సావిత్రి ని చూసి వరలక్ష్మి అనుకోని భుజం మీద చెయ్యి వేసి అంత ఒకే అయితే షూట్ కి రా అని అన్నారట.

దానితో సావిత్రి కి కోపం వచ్చింది.గట్టిగా అరిచింది.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు

ఎవరో ఏంటో తెలియకుండా చెయ్యి వేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

కానీ తాను అనుకోకుండా చేసిన పనిని చంద్రన్ వివరణ ఇవ్వడం తో ఆమె శాంతించింది కానీ అక్కడే ఉన్న సావిత్రి తండ్రి వెంకట రామ చౌదరి( Savitri Father )చంద్రన్ పై నసుగుతూనే ఉన్నాడు.అలాగే అప్పటికి పేచీలు ఎక్కువ గా పెడుతున్న వరలక్ష్మిని సైతం పనిలో పనిగా అరుస్తున్నాడు.అది తెలిసి వరలక్ష్మి సావిత్రి తండ్రి పై చెప్పు చూపించి బెదిరించింది.

దాంతో సావిత్రి కూడా పెద్దగానే వాదించింది.ఆ రోజు ఆ వివాదం అయితే ముగిసింది కానీ సావిత్రి కొత్తగా కొనుక్కున్న కారు టైర్స్( Car Tyres ) ని వరలక్ష్మి కట్ చేయించడం తో మళ్లి వివాదం మొదలై కొన్నాళ్ల పాటు ఇది సాగింది.

తాజా వార్తలు