విజయ్ తో మంచి సంబంధాలున్నాయి.. తీరు మార్చుకునేది లేదు.. వనిత కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో వనితా విజయ్ కుమార్ అనేక వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే వనితా విజయ్ కుమార్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వనితా విజయ్ కుమార్ కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హీరో విజయ్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని కామెంట్లు చేశారు.వరుసగా సినిమాలు, సినిమా ప్రమోషన్లతో వనితా విజయ్ కుమార్ బిజీగా ఉన్నారు.

విజయ్ తో ఉండే ఫ్రీడమ్ వల్లే తాను ఆయనతో మాట్లాడుతున్నానని వనిత చెప్పుకొచ్చారు.ఇతరులు తన గురించి చేసే నెగటివ్ కామెంట్ల గురించి తాను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.

ఫైర్ బ్రాండ్ గా పేరును సొంతం చేసుకున్న వనితా విజయ్ కుమార్ విజయ్ తో మాట్లాడే విషయంలో తనను తాను మార్చుకోవడం సాధ్యం కాదని వెల్లడించారు.అయితే కొంతమంది తన మాటలు విని తాను పొగరుతో మాట్లాడుతున్నానని భావిస్తున్నారని ఆమె అన్నారు.

Vanitha Vijay Kumar Interesting Comments About Hero Vijay Goes Viral Details, Va
Advertisement
Vanitha Vijay Kumar Interesting Comments About Hero Vijay Goes Viral Details, Va

విజయ్ గురించి మొదటి నుంచి ఏ విధంగా మాట్లాడుతున్నానో ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నానని విజయ్ తో మాట్లాడే మాటల విషయంలో ఎలాంటి మార్పు లేదని వనిత తెలిపారు.కొంతమంది విజయ్ అభిమానులకు తాను చేసిన వ్యాఖ్యలు నచ్చడం లేదని అయినప్పటికీ విజయ్ విషయంలో తాను మారే అవకాశం అయితే లేదని ఆమె అన్నారు.వనిత చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Vanitha Vijay Kumar Interesting Comments About Hero Vijay Goes Viral Details, Va

మరోవైపు తమిళంలో ప్రసారం కానున్న బిగ్ బాస్ ఓటీటీకి వనితా విజయ్ కుమార్ ఎంపికయ్యారు.వనితా విజయ్ కుమార్ కు సినిమా సినిమాకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.తమిళంలో వనితా విజయ్ కుమార్ బిగ్ బాస్ ఓటీటీ విజేతగా నిలుస్తారేమో చూడాల్సి ఉంది.

కొందరు నెటిజన్లు మాత్రం వనిత తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచిస్తున్నారు.

Finance And Health Minister Harish Rao Laid The Foundation Stone For The New OPD Block To Be Built
Advertisement

తాజా వార్తలు