తిరుపతిలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల జారీ

తిరుపతిలో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లను టీటీడీ అధికారులు జారీ చేస్తున్నారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగానే టికెట్ల జారీని ప్రారంభించారు.

మొత్తం తొమ్మిది కేంద్రాల్లో దర్శనం టికెట్లను జారీ చేస్తున్నారు.కాగా రేపటి నుంచి 11వ తేదీ వరకు తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.

రోజుకు 45 వేల టికెట్లు చొప్పున పది రోజులకు నాలుగున్నర లక్షల టికెట్లు విక్రయించనున్నారు.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!
Advertisement

తాజా వార్తలు