అందుకే చిత్తయ్యాం...! ఈ ఎన్నికల కోసం కొత్త ఎత్తులు వేస్తున్న కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు.మొన్న జరిగిన ఎన్నికల్లో టి.

కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికల వరకు వెళ్లినా.ఘోరంగా దెబ్బతినడంతో పాటు పార్టీ సీనియర్ నాయకులూ ఓటమి చెందడంతో.

తలెత్తుకుని జనాల్లో తిరగలేని పరిస్థితుల్లో ఉండిపోయారు కాంగ్రెస్ నేతలు.అందుకే ఎన్నిఅకాల ఫలితాల అనంతరం ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగాయని.

హడావుడి చేసి ఆ తరువాత సైలెంట్ అయిపోయారు.అసలు మనం ఎందుకు ఓడిపోయాం అంటూ విశ్లేషించుకుంటూ ఇళ్లకే పరిమితం అయిపోయారు.

Advertisement

ఈ లోపు తెలంగాణ అధికార పార్టీ గెలిచిన కొద్దిమంది ఎమ్యెల్యేలను తమ గూటికి చేర్చుకునేందుకు ఆ పార్టీ కి పుండు మీద కారం చల్లినట్టుగా తయారయ్యింది.

అయితే ఆ చేదు అనుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.తెలంగాణ కాంగ్రెస్.ప్రస్తుతం తెలంగాణాలో మూడు కీలక ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంట్లో కూర్చుని సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ లు ఒక్కరొక్కరుగా బయటకు రావడం మొదలు పెట్టారు.

పంచాయితీ ఎన్నికలు నుంచి పార్లమెంట్ వరకు వరుసగా ముంచుకొస్తున్న ఎన్నికలను ఏదోరకంగా ఎదుర్కొని పోయిన పరువు కొంతయినా దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు అడుగులు ముందుకు వేస్తున్నారు.ఇప్పుడు వీరందరికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దైర్యం చెప్తూ.

రాబోయే మూడు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా.పార్టీ నాయకులను సిద్ధం చేస్తున్నాడు.

ఇక ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలో కూడా .పార్టీ నాయకులకు హితబోధ చేస్తున్నారు ఉత్తమ్.అంతే కాదు మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ ఎందుకు విజయం సాదించలేకపోయిందో.

Advertisement

చెప్పుకునేందుకు ఒక కారణాన్ని కాంగ్రెస్ సిద్ధం చేసుకుంది.అటు లీడర్లు ఇటు క్యాడర్లో జోష్ పెంచేందుకు ఎన్నికల పరాజయాన్ని ప్రజల్లో ఎలా చెప్పుకోవాలో క్లాస్ తీసుకుంటున్నారు ఉత్తమ్.

ఎన్నికల్లో అవకతవకలు, ఈవీఎం ల ట్యాపరింగ్ వంటి కారణాల వల్లనే ఈనికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది అని కాంగ్రెస్ జనాల్లోకి వెళ్లేందుకు చూస్తున్నాయి.అంతే కాదు.

కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ ఎన్నికలతో నిరాశపడొద్దని.ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనమే విజయం సాదిస్తామంటూ.

ధైర్యం చెబుతున్నారు.దీంతో పాటు సోనియా లేక రాహుల్ తో మరోసారి సభ పెట్టించాలని ఆలోచనలో టి.కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్నారు.

తాజా వార్తలు