పవన్ కారణంగానే ''ఉస్తాద్'' రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదా?

పవర్ స్టార్ (Power Star) వరుస ప్లాప్స్ తో సతమతం అవుతున్న సమయంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ (Gabbar Singh) లాంటి హిట్ ఇచ్చాడు.

ఈ సినిమా వీరిద్దరి కెరీర్ కు చాలా ప్లస్ అయ్యింది.

ఇక ఇప్పుడు మరోసారి ఇదే కాంబో రిపీట్ కాబోతుంది.దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఈగర్ గా వైట్ చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరీష్ శంకర్ (Harish Shankar) తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మూవీ కూడా ఉంది.ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

గత రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు హరీష్ శంకర్ అధికారికంగా తెలిపాడు.వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడు.

Advertisement

ఇదిలా ఉండగా మొన్న ఈ సినిమా నుండి అదిరిపోయే ప్రీ లుక్ పోస్టర్ (UBS Pre Look Poster) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.పవర్ స్టార్ పోలీస్ గెటప్ లో ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ తో హైప్ బాగా పెరిగింది.

ఇలా పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన హరీష్ శంకర్ మరో గబ్బర్ సింగ్ ను పవన్ కు ఇస్తాడు అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ ప్రీ లుక్ పోస్టర్ లో రిలీజ్ డేట్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇండస్ట్రీ వర్గాల్లో వస్తున్న బజ్ ప్రకారం అయితే వచ్చే సంక్రాంతి (2024 Sankranthi) కి రిలీజ్ అవుతుంది అని అంటున్నారు.

కానీ మేకర్స్ అఫిషియల్ గా రిలీజ్ డేట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.మరి హరీష్ క్లారిటీ ఇవ్వకపోవడం వెనుక కారణం పవన్ అని అంటున్నారు.ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రజెంట్ పలు కమిట్మెంట్స్ తో పాటు రాజకీయాలలో (Politics) కూడా పాల్గొనాల్సి వస్తుంది.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

దీంతో ముందుగానే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తే అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది అని చెప్పడం కష్టమే.

Advertisement

దీంతో షూట్ దాదాపు పూర్తి అయ్యే సమయానికి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందని.

అందుకే పోస్టర్ లో ఎలాంటి హింట్ ఇవ్వలేదని తెలుస్తుంది.కాగా మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తుంది అని వార్తలు వస్తుండగా.

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు