వారంలో ఒక్క‌సారి ఈ స్ప్రేను వాడితే హెయిర్ గ్రోత్ రెట్టింపు అవుతుంది!

ఇటీవల రోజుల్లో ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, మారిన జీవనశైలి, ఒత్తిడి, నిద్ర నిర్లక్ష్యం చేయడం, మద్యపానం, ధూమపానం తదితర కారణాల వల్ల చాలా మంది లో హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది.

హెయిర్ గ్రోత్ తగ్గిపోవడం వల్ల పొడవైన మరియు ఒత్తైన జుట్టు కావాలన్న‌ కల కలగానే మిగిలిపోతుంది.

దాంతో హెయిర్ గ్రోత్ ను పెంచుకునేందుకు రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ స్ప్రేను వాడితే కనుక హెయిర్ గ్రోత్ అద్భుతంగా రెట్టింపు అవుతుంది.

దాంతో కురుల‌ను ఒత్తుగా మరియు పొడవుగా మార‌తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ స్ప్రేను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకోవాలి.ఆ గిన్నెలో ఒక గ్లాస్‌ వాటర్ పోయాలి.

Advertisement

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు మందారం పూలు, మూడు మందారం ఆకులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ వేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ పై ఉడికించాలి.ఆ త‌ర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియ‌ల్ ఆయిల్ ను మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.అనంత‌రం జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్ప్రే చేసుకుని షవర్ క్యాప్ ధ‌రించాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూను యూస్ చేసి తలస్నానం చేయాలి.

వారంలో ఒక్కసారి ఈ విధంగా చేస్తే హెయిర్ గ్రోత్ సూపర్ గా రెట్టింపు అవుతుంది.తద్వారా జుట్టు పొడుగ్గా మరియు ఒత్తుగా పెరుగుతుంది.అలాగే ఈ హెయిర్ స్ప్రే ను వాడటం వల్ల జుట్టు రాలడం, చిట్లడం వంటివి కంట్రోల్ అవుతాయి.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

మరియు కురులు షైనీ గా సైతం మెరుస్తాయి.

Advertisement

తాజా వార్తలు