White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!

తెల్ల జుట్టు.( White Hair ) స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంతో మందిని కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

ఒత్తిడి, పోషకాల కొరత, స్మోకింగ్, థైరాయిడ్, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పలు రకాల వ్యాధులు, వయసు పైబ‌డటం తదితర కారణాల వల్ల జుట్టు తెల్లబడుతుంది.అయితే తలలో తెల్ల వెంట్రుకలు చూడగానే ప్రతి ఒకరు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు.

కానీ వర్రీ వద్దు.ఆరంభంలోనే పలు జాగ్రత్తలు తీసుకుంటే చాలా సులభంగా వైట్ హెయిర్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

మొదట ఒత్తిడికి దూరంగా ఉండండి.స్మోకింగ్ అలవాటు మానుకోండి.

Advertisement

విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్‌ వంటి పోషకాలు మెండుగా ఉండే ఆహారాలు డైట్ లో చేర్చుకోండి.రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తుల‌ను పూర్తిగా అవాయిడ్ చేయండి.

హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడకం తగ్గించండి.ఇక ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ( Oil ) వైట్ హెయిర్ సమస్యకు సమర్థవంతంగా అడ్డు కట్ట వేస్తుంది.

మీ కురులను మళ్లీ నల్లగా మారేలా ప్రోత్సహిస్తుంది.

ఈ ఆయిల్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవనూనె( Mustard Oil ) పోసుకోవాలి.ఆయిల్ కాస్త హిట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్,( Henna Powder ) వన్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ పౌడర్,( Amla Powder ) వన్ టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ వేసుకొని బాగా కలిపి చిన్న మంటపై కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చ‌ల్లారబెట్టుకోవాలి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

పూర్తిగా కూల్ అయ్యాక ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్‌ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు శుభ్రంగా తల స్నానం చేయాలి.

Advertisement

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేశారంటే జుట్టు తెల్లగా మారడం కంట్రోల్ అవుతుంది.అలాగే తెల్లగా మారిన జుట్టు మళ్ళీ నల్లగా మారుతుంది.

ఈ ఆయిల్ తో సహజంగానే వైట్ హెయిర్ సమస్యను దూరం చేసుకోవచ్చు.పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాల‌డం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.

తాజా వార్తలు