ఈ మ్యాజికల్ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!

సహజంగానే మనలో కొందరి జుట్టు చాలా పల్చగా ఉంటుంది.ఇలాంటివారు ఒత్తైన జుట్టు కలిగిన వారిని చూసి ఎంతగానో అసూయ పడుతుంటారు.

తమ జుట్టును కూడా ఒత్తుగా మార్చుకునేందుకు రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.తోచిన ఇంటి చిట్కాల‌న్ని పాటిస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? పల్చటి జుట్టును ఒత్తుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టానిక్( Hair tonic ) మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.వారానికి ఒకసారి ఈ హెయిర్ టానిక్ ను వాడితే మీరు వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.

Using This Magical Tonic Will Make Your Hair Grow Thicker Thick Hair, Magical T

అందుకోసం ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకుని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Advertisement
Using This Magical Tonic Will Make Your Hair Grow Thicker! Thick Hair, Magical T

వాటర్ హీట్ అయ్యాక దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలతో పాటు రెండు టీ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ) వేసి బాగా కలిపి మరిగించాలి.వాటర్ సగం అయ్యేంతవరకు మరిగించి స్టవ్‌ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టైనర్ సాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె( Mustard oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మన టానిక్ అనేది సిద్ధమవుతుంది.

ఈ హెయిర్ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Using This Magical Tonic Will Make Your Hair Grow Thicker Thick Hair, Magical T

ఈ టానిక్ కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.పల్చటి జుట్టును క్రమంగా ఒత్తుగా మారుస్తుంది.కురులు దట్టంగా పెరిగేందుకు ఈ హెయిర్ టానిక్ చాలా బాగా సహాయపడుతుంది.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

అలాగే ఈ న్యాచురల్ టానిక్ ను వాడటం వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.కురులు ఆరోగ్యంగా మారతాయి.షైనీ గా మెరుస్తాయి.

Advertisement

ఈ టానిక్ లో కాఫీ పౌడర్ ను వాడటం వల్ల జుట్టు త్వరగా తెలబడకుండా కూడా ఉంటుంది.ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఒత్తైన నల్లని ఆరోగ్యమైన కురులను కోరుకునేవారు తప్పకుండా ఈ హెయిర్ టానిక్ ను తయారు చేసుకుని వాడండి.

తాజా వార్తలు