మొటిమలు మచ్చలుగా మారి ముఖంపై అసహ్యంగా కనిపిస్తున్నాయా.. ఈ హోమ్ మేడ్ టోనర్ వాడితే క్లియర్ స్కిన్ మీ సొంతమైనట్లే!

టీనేజ్ ప్రారంభం అయినప్పటి నుంచి అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి.

అయితే కొందరిలో మొటిమలు రెండు మూడు రోజులకు మాయం అవుతాయి.

కొందరిలో మాత్రం మొటిమలు మచ్చలుగా మారి ముఖంపై అసహ్యంగా కనిపిస్తుంటాయి.ఈ రెండో కేటగిరీలో మీరు కూడా ఉన్నారా.

అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టోనర్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది.ఈ టోనర్ ను వాడితే క్లియర్ స్కిన్ మీ సొంతం అవ్వడం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం మొటిమలు( Acne ) తాలూకు మచ్చలను పోగొట్టే ఆ టోనర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Using This Homemade Toner Will Get Rid Of Acne Scars Acne Scars, Acne, Acne Sca
Advertisement
Using This Homemade Toner Will Get Rid Of Acne Scars! Acne Scars, Acne, Acne Sca

ముందుగా ఒక ఆరెంజ్ పండు తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత ఆరెంజ్ పండు తొక్కను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఆరెంజ్ తొక్కలు, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, ఒక చిన్న కప్పు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్( Tea Tree Essential Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన టోనర్ సిద్ధం అయినట్టే.

Using This Homemade Toner Will Get Rid Of Acne Scars Acne Scars, Acne, Acne Sca

ఈ టోనర్ ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని ముఖానికి మరియు మెడకు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ టోనర్ ను కనుక వాడితే అద్భుత ఫలితాలు పొందుతారు.ఈ టోనర్ లో విటమిన్ సి రిచ్ గా ఉంటుంది.

ఇది మొటిమలు మరియు మొటిమల తాలూకు మచ్చలను సమర్థవంతంగా నివారిస్తుంది.క్లియర్ స్కిన్ మీ సొంతం అయ్యేలా చేస్తుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

అలాగే ఈ టోనర్ ను వాడటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.పిగ్మెంటేషన్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.

Advertisement

మరియు ముఖం అందంగా సైతం మెరుస్తుంది.

తాజా వార్తలు