ఈ హెయిర్ స్ప్రే వాడితే ముప్పై రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా మారుతుంది!

ఒత్తైన జుట్టు కావాల‌ని ప్ర‌తి అమ్మాయి కోరుకుంటుంది.ఒత్తైన జుట్టు చూపురుల‌కు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.

పైగా ఒత్తైన జుట్టుతో ర‌క‌ర‌కాల హెయిర్ స్టైల్స్ కూడా వేసుకోవ‌చ్చు.కానీ, ప‌ల్చ‌ని జుట్టుతో ఎలాంటి హెయిర్ స్టైల్స్ ను వేసుకోలేము.

అందుకే ఒత్తైన జుట్టు కోసం తెగ ఆరాట‌ప‌డుతుంటారు.మీరు ఆ జాబితాలో ఉన్నారా.? ఒత్తైన జుట్టు కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా.? అయితే డోంట్ వ‌ర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ మేడ్ హెయిర్ స్ప్రేను వాడితే ముప్పై రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా మార‌డం ప్రారంభం అవుతుంది.

మ‌రి ఇంత‌కీ ఆ హెయిర్ స్ప్రేను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల మెంతులు, రెండు రెబ్బ‌ల క‌రివేపాకు, ఒక‌టిన్న‌ర గ్లాస్ వాట‌ర్ వేసుకుని నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.

Advertisement

మ‌రుస‌టి రోజు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని నాన‌బెట్టుకున్న మెంతులు, క‌రివేపాకును వాట‌ర్‌తో స‌హా వేసి.ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు మ‌రిగించాలి.
నీరు స‌గం అయ్యాక స్ట‌వ్ ఆఫ్ చేసుకుని.

ఉడికించిన వాటిని చ‌ల్లార‌బెట్టుకోవాలి.కంప్లీట్‌గా కూల్ అయ్యాక నీటితో స‌హా మెంతులు, క‌రివేపాకును మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసి.

జ్యూస్ ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం, రెండు చుక్క‌లు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేస్తే హెయిర్ స్ప్రే సిద్ధం అయిన‌ట్లే.

దీనిని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు స్ప్రే చేసుకుని.రెండు గంటల అనంత‌రం మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ హెయిర్ స్ప్రేను గ‌నుక వాడితే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మీ ప‌ల్చ‌టి జుట్టు ముప్పై రోజుల్లో ఒత్తుగా పెర‌గ‌డం ప్రారంభం అవుతుంది.మ‌రియు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు