ఒక కంపెనీ ఫోన్ ఛార్జర్‌ను వేరొక ఫోన్‌కు వాడితే ఇంత ప్రమాదమా.. ?

మనలో చాల మందికి ఉన్న అలవాటు ఏంటంటే.ఒక ఫోన్ ఛార్జర్ మరో ఫోన్‌కు ఉపయోగిస్తారు.

ఈ పనిని చేయని వారంటు ఉండరు.పొరబాటున అలా ఒక ఛార్జర్ మరో ఫోన్‌కు ఉపయోగించ వద్దని చెబితే చెప్పిన వారు పిసినారులుగా, వేస్ట్ ఫెలోలుగా మిగిలిపోతారు.

Using, Another, Mobile Charger, Kills, Battery Life Time-ఒక కంపెన�

ఎవరు ఏమనుకున్న ఇలా ఇష్టం వచ్చినట్లుగా మరో కంపెనీ ఛార్జర్లు ఉపయోగిస్తే మాత్రం సెల్ పాడవడం మాత్రం ఖాయమంటున్నారు నిపుణులు.బ్యాటరీ దెబ్బ తినడాకిని, ఛార్జింగ్ సరిగా లేకపోవడానికి కారణం ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఛార్జర్ కాకుండా వేరే కంపెనీ ఛార్జర్లు పెట్టడం.

ఇకపోతే ప్రతి కంపెనీ ఫోన్ కు ఒక చార్జర్ ఉంటుంది.అది కేవలం ఆ కంపెనీ ఫొన్ లకు మాత్రమే ఛార్జింగ్ చేసుకోవడానికి వినియోగించాలి.

Advertisement

ఆలా కాదని ఇతర ఫొన్ లకు కూడా వాడినట్టయితే కొంతకాలానికి ఛార్జింగ్ సరిగా లేక బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందట.ఎందుకంటే ప్రతి సెల్ కంపెనీ ఆ ఫొన్ రెసిస్టెన్స్ ప్రకారం చార్జర్ ను తయారు చేస్తాయి.

అంతే కాకుండా ఫోన్ నుంచి వచ్చే హీట్ ను తగ్గించుకోవడానికి వాడే ‘హీట్ సింక్’ సామర్ధ్యం ఎంత ఉంటుందో.అందుకు తగ్గట్టే ఫోన్ చార్జర్ కూడా తయారు చేస్తారు.

ఇలా ఒక్కో కంపెనీ ఫోన్ కు ఒక్కో విధంగా తయారు చేయబడుతుందట.అయితే ఇలాంటి తప్పుపని చేయడం వల్ల బ్యాటరీ ఉబ్బడం, ఫోన్లో ఉండే రేడియేషన్ ఒకదాని ద్వారా మరొక ఫోన్ కు వ్యాపించడం జరుగుతుందట.

దీని కారణంగా ఫోన్ హ్యాంగ్ అవడం, ఒక్కోసారి ఫోన్ సాఫ్ట్ వేర్ పనిచేయకుండా పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు.కాబట్టి మీ సెల్‌తో వచ్చిన ఛార్జరే వాడండని నిపుణులు పేర్కొంటున్నారు.

వార్నీ... ఏడిస్తే కూడా ఇన్ని లాభాలు ఉన్నాయా??
Advertisement

తాజా వార్తలు