క్రీములు అక్కర్లేదు.. ఈ హోమ్ మేడ్ సీరంను వాడితే సహజంగానే తెల్లగా మారతారు!

చాలా మంది తెల్లగా మారడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీముల‌ను వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే క్రీములు అక్కర్లేదు.

సహజంగా కూడా తెల్లగా మారడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరంను కనుక వాడితే సహజంగానే తెల్లగా మరియు కాంతివంతంగా మారతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం స్కిన్ వైట్నింగ్ కు సహాయపడే ఆ హోమ్ మేడ్‌ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా క‌డిగి తొక్క తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పండు ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఎనిమిది నుంచి ప‌ది టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు, రెండు చుక్కలు స్వీట్ ఆల్మండ్‌ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం సిద్ధమవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న సీరంను ముఖానికి అప్లై చేసుకుని నిద్రించాలి.

ప్రతిరోజు ఈ సీరంను కనుక‌ వాడితే చర్మం సహజంగానే తెల్లగా కాంతివంతంగా మారుతుంది.స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడే వారికి ఈ సీరం ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ సీరం ను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

ఈ సీరం చర్మాన్ని తేమగా మరియు నిగారింపుగా సైతం మెరిపిస్తుంది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు