ఈ హోం మేడ్ క్రీమ్‌ను వాడితే ముడ‌త‌లు పోయి ముఖం స్మూత్‌గా మారుతుంది!

వ‌య‌సు పైబ‌డే కొద్ది చ‌ర్మంపై ముడ‌త‌లు రావ‌డం స‌ర్వ సాధార‌ణం.అయితే ఆ ముడ‌త‌లు మ‌న‌లోని మ‌నోధైర్యాన్ని స‌న్న‌గిల్లేలా చేస్తాయి.

అత్మ‌విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి.ముడ‌త‌లు రాగానే అందం త‌గ్గిపోయిన‌ట్లు క‌నిపిస్తుంది.

అందుకే చ‌ర్మంపై ఏర్ప‌డ్డ ముడ‌త‌ల‌ను త‌గ్గించుకోవ‌డం కోసం మార్కెట్లో ల‌భ్య‌మ‌య్యే యాంటీ ఏజింగ్ క్రీములను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే వాటి వ‌ల్ల ఎంత ఉప‌యోగం ఉంటుందో తెలియ‌దు గానీ.

ఇప్పుడు చెప్ప‌బోయే హోం మేడ్ యాంటీ ఏజింగ్ క్రీమ్‌ను వాడితే మాత్రం ముడ‌త‌లు పోయి ముఖం స్మూత్‌గా మార‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ క్రీమ్ ఏంటో.

Advertisement
Use This Home Made Cream To Get Rid Of Wrinkles And Make Your Face Smooth ,homem

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బ‌ట‌ర్ వేసుకోవాలి.

ఆ త‌ర్వాత అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, రెండు టేబుల్ స్పూన్లు వాసెలిన్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌రకు మిక్స్ చేసుకుంటే.హోం మేడ్ యాంటీ ఏజింగ్ క్రీమ్ సిద్ధ‌మైన‌ట్లే.

Use This Home Made Cream To Get Rid Of Wrinkles And Make Your Face Smooth ,homem

ఈ క్రీమ్‌ను ఒక బాక్స్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవ‌చ్చు.ప్ర‌తి రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి మేక‌ప్‌ను కంప్లీట్ గా తొల‌గించి వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై త‌యారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా మ‌సాజ్ చేసుకోవాలి.

ఈ క్రీమ్ ను ప్ర‌తి రోజు గ‌నుక యూస్ చేస్తే చ‌ర్మంపై ఏర్ప‌డ్డ ముడ‌త‌లు క్ర‌మంగా దూరం అవుతాయి.అదే స‌మ‌యంలో ముఖ చ‌ర్మం స్మూత్‌గా మ‌రియు సాఫ్ట్‌గా మారుతుంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

కాబ‌ట్టి, ఈ న్యాచుర‌ల్ యాంటీ ఏజింగ్ క్రీమ్‌ను త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

Advertisement

తాజా వార్తలు