అమెరికా వీధుల్లో మత్తులో ఊగిన భారతీయ మహిళ.. నల్లజాతి మహిళను ఏమందో తెలుసా?

పాశ్చాత్య దేశాల్లో భారతీయులు జాతి వివక్షను( Racism ) ఎదుర్కొవడం గురించి వినడం సర్వసాధారణం.

కానీ ఈసారి భారత సంతతికి చెందిన ఓ మహిళే జాతి వివక్ష చూపించి అడ్డంగా బుక్ అయిపోయింది.

కాలిఫోర్నియాలోని( California ) పినోలేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఓ భారతీయ మహిళలా( Indian Woman ) కనిపిస్తున్న వ్యక్తి, ఓ నల్లజాతి మహిళతో వాగ్వాదానికి దిగింది.

జాతి వివక్షతో కూడిన పదజాలాన్ని ఉపయోగించింది.పియర్ స్ట్రీట్ బిస్ట్రో బయట జరిగిందీ గొడవ.13 సెకన్ల వైరల్ వీడియో క్లిప్ ఓపెన్ చేస్తే కారులో కూర్చున్న ఓ మహిళ, బయట నిలబడి వీడియో తీస్తున్న మరో మహిళ మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం చూడవచ్చు.మత్తులో ఊగుతూ, చిరాకుగా ఉన్న భారతీయ మహిళ, వీడియో తీస్తున్న నల్లజాతి మహిళను( Black Woman ) ఉద్దేశించి అసభ్య పదజాలంతో పాటు "నిగ్గ*" అనే పదాన్ని పదే పదే వాడింది.

అసలు గొడవకు కారణం వీడియోలో స్పష్టంగా కనిపించకపోయినా, పార్కింగ్ విషయంలో గొడవ జరిగిందని తెలుస్తోంది.

Advertisement

"I Expose Racists & Pedos" అనే ట్విట్టర్ (ప్రస్తుతం X) ఖాతాలో ఈ వీడియో మొదట షేర్ చేశారు."జాతివివక్ష కలిగిన మహిళ నల్లజాతి మహిళను పదే పదే నీ**రు అని పిలుస్తోంది" అనే క్యాప్షన్ తో వీడియోను పోస్ట్ చేశారు.అప్పటినుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇంతవరకు ఈ ఇద్దరు మహిళలు ఎవరనేది తెలియరాలేదు.జాతి వివక్షను తరచుగా ఎదుర్కొనే ఒక వర్గం నుండి వచ్చిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం చాలా అరుదుగా చూస్తాం.అందుకే నెటిజన్లు ఆగ్రహం, నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ మహిళ సిగ్గుపడాలని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరికొందరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పియర్ స్ట్రీట్ బిస్ట్రో కూడా ఈ పరిస్థితిపై బహిరంగంగా స్పందించాలని చాలామంది కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, ఇదే మహిళ "క్రాక్" అని పిలిచే కొకైన్‌ను స్మోక్ చేస్తున్నట్లుగా ఉన్న మరో వీడియోను కూడా అదే ఖాతాలో షేర్ చేశారు.అయితే, ఈ విషయం ఇంకా ధృవీకరించలేదు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

హిప్-హాప్ వైబ్.కామ్ ప్రకారం, ఆమె మాటలు తీవ్రంగా బాధ కలిగించినప్పటికీ, ఆమె చర్యల్లో బెదిరింపులు లేదా శారీరక హింస లేకపోతే, ఆమె చట్టపరమైన శిక్షను ఎదుర్కొనే అవకాశం తక్కువ.

Advertisement

తాజా వార్తలు