ఉప్పెనతో గుండె బరువెక్కడం ఖాయమట!

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తొలి చిత్రం ఉప్పెన షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.

ఇక ఈ సినిమాలోని ప్రేమకథ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా విఫలమైందనే అంశం చూస్తే ప్రేక్షకుల గుండె బరువెక్కుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

Uppena, Vaishnav Tej, Kriti Shetty, Sukumar-ఉప్పెనతో గుం�

కాగా ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండనుందా అనే ఆసక్తి చిత్ర వర్గాల్లోనూ నెలకొంది.ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు