Upendra Gadi Adda: ఉపేంద్ర గాడి అడ్డా సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

ప్రస్తుత కాలంలో మాస్ ఎంటర్టైనర్ సినిమాలకు యువతలో మంచి ఆదరణ ఉంది.

ఇలాంటి సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నటువంటి తరుణంలో యంగ్ హీరోలు అందరూ కూడా ఈ తరహా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే మాస్ ఎంటర్టైనర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఉపేంద్ర గాడి అడ్డా(Upendra Gadi Addaa ) .కంచర్ల ఉపేంద్ర ( Upendra ) నటించిన ఈ సినిమాలో అతనికి జోడీగాసావిత్రి కృష్ణ ( Savitri Krishna ) నటించారు.ఆర్యన్ సుభాన్ ఎస్.కె.దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్.ఎస్.ఎల్.ఎస్( SSLS ) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించారు.మరి ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎలాంటి ఆదరణ అందుకుందో తెలియాల్సి ఉంది.

కథ:

ఉపేంద్ర(కంచర్ల ఉపేంద్ర) బంజారాహిల్స్ ని ఓ బస్తీ కుర్రాడు.డిగ్రీ వరకూ చదువుకున్నా.

ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా డబ్బు సంపాదించాలి అనే మనస్తత్వం ఉన్నటువంటి కుర్రాడు ఈ క్రమంలోని అప్పు చేసి పబ్బుల చుట్టూ తిరుగుతూ బాగా డబ్బున్న అమ్మాయిలను ప్రేమలో పడేయాలి అనుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే బాగా డబ్బున్నటువంటి సావిత్రి కృష్ణ తనకు పరిచయమవుతుంది.

Advertisement
Upendra Gadi Adda Movie Review And Rating-Upendra Gadi Adda: ఉపేంద్

ఉపేంద్ర కూడా తనకు డబ్బు ఉందని చెబుతూ సావిత్రిని( Savitri Krishna ) నమ్మించారు.అయితే ఒకానొక సమయంలో తాను ఆ అమ్మాయికి నిజం చెప్పాలని భావించి తాను డబ్బున్న కుర్రాడు కాదని ఒక బస్తి కుర్రాడు అనే విషయాన్ని సావిత్రికి చెబుతాడు ఉపేంద్ర.

మరి ఉపేంద్ర బస్తి కుర్రాడు అని తెలిసి స్వాతి తనని ప్రేమిస్తుందా వీరిద్దరికీ పెళ్లి జరుగుతుందా అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Upendra Gadi Adda Movie Review And Rating

నటీనటుల నటన:

ఉపేంద్ర మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అద్భుతంగా నటించారు.డబ్బున్న కుర్రాడిగాను అలాగే బస్తికురాడి పాత్రలలో రెండు వేరియేషన్లలో ఉపేంద్ర చాలా అద్భుతంగా కనిపించారు.ఇక సినీనటి సావిత్రి కృష్ణ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది ఇక జబర్దస్త్ బ్యాచ్ మొత్తం ఉన్నంతసేపు బాగానే నవ్వించారు.

ఇలా ఎవరి పాత్రకు వారు పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి.

Upendra Gadi Adda Movie Review And Rating
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

టెక్నికల్:

దర్శకుడు రాసుకున్న కథ బాగుంది ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాని చాలా ఎంటర్టైనింగ్ ప్రేక్షకుల ముందు తీసుకు వచ్చినటువంటి ఈయన ప్రతిభ అద్భుతం అని చెప్పాలి ఇక కెమెరా విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు అనిపించింది మ్యూజిక్ కూడా పరవాలేదనిపించింది.

Advertisement

విశ్లేషణ:

యువతను ఆకట్టుకున్నటువంటి ఈ మాస్ ఎంటర్టైన్ సినిమాకు సరికొత్త సందేశాన్ని జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ప్రస్తుత కాలంలో యువత సెల్ ఫోన్ కి బానిసలుగా మారి ఎలా చెడిపోతున్నారనే అంశాలను దర్శకుడు బాగా చూపించారు.సెల్ ఫోన్ల కారణంగా ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతున్నటువంటి అంశాలను కూడా చూపించారు.

మొదటి హాఫ్ మొత్తం సరదాగా సాగిపోయిన రెండో హాఫ్ మాత్రం ఒక చక్కని సందేశాన్ని చూపించారు.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, సరదా సన్నివేశాలు, సినిమా ద్వారా చక్కని మెసేజ్ చూపించారు.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చూసిన సన్నివేశాలు అలాగే అనిపించాయి మ్యూజిక్.

బాటమ్ లైన్

: ఇప్పటివరకు మాస్ ఎంటర్టైనర్ సినిమాలు వచ్చాయి అలాగే సందేశాత్మక చిత్రాలు కూడా వచ్చాయి కానీ ఈ సినిమా ఒకవైపు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు ఓ చక్కని సన్నివేశాన్ని అందించిందని చెప్పాలి.

రేటింగ్ 3/5

తాజా వార్తలు