అంతకు మించిన యాక్షన్ చూపిస్తామని చెబుతున్న టాలీవుడ్ స్టార్స్.. అసలేం జరిగిందంటే?

ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమాల్ని ఆస్వాదించే తీరు మారిపోయింది.ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్‌ లాంటి విషయాల్లో సాధారణ విషయాలు బొత్తిగా ఆనడం లేదు.

ఏం చేసినా సరే అంతకు మించి అనేట్లుగా ఉండాల్సిందే.ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో యాక్షన్స్ సన్నీ వేషాలను హింసాత్మక యాక్షన్స్ ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు.

ఇలాంటి తరహాలో విడుదలైన ప్రతి ఒక్క సినిమాను బాగా ఆదరించడంతోపాటు సినిమాలకు వసూళ్ల వర్షం కురిపించి భారీ విజయాలను అందిస్తున్నారు.అయితే నిజానికి ఇది వరకు తెలుగులో ఈ స్థాయి ఓవర్‌ ది బోర్డ్‌ యాక్షన్‌ చిత్రాలు అరుదుగానే కనిపించేవి.

కానీ, ఇప్పుడీ ట్రెండ్‌ ను తెలుగు చిత్రసీమ కూడా అనుసరించే ప్రయత్నం చేస్తోంది.ఇకపోతే అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన పుష్ప 2( Pushpa 2 ) గత ఏడాది విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Advertisement

పతాక ఘట్టాల్లో మహాకాళి అవతారంలో బన్నీ విజృంభించిన తీరు.శత్రువుల్ని కత్తికో కండగా చీల్చి చెండాడిన విధానం మాస్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.

ఆ ఎపిసోడ్‌ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది.ఈ సినిమా కంటే ముందు ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన సలార్( Salaar ) సినిమాలో కాటేరమ్మ కొడుకులా ప్రభాస్‌ సృష్టించిన రక్తపాతం చేసిన యాక్షన్‌ సీన్ యాక్షన్‌ ప్రియుల్ని మురిపించింది.

ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా సలార్‌ 2 రావాల్సి ఉంది.

మరి దాంట్లో ప్రభాస్‌ తో ప్రశాంత్‌ నీల్‌ ఇంకెంతటి రక్తపాతం సృష్టిస్తాడో చూడాలి మరి.దసరా సినిమాతో తనలోని వైల్డ్‌ యాక్షన్‌ కోణాన్ని సినీ ప్రియులకు రుచి చూపించారు హీరో నాని.అయితే ఇప్పుడు అంతకు మించిన హింసాత్మక యాక్షన్‌ చిత్రాన్ని హిట్‌: ది థర్డ్‌ కేస్‌ రూపంలో ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు.దీంట్లో ఆయన శత్రువుల్ని వేటాడే తీరు ఈ క్రమంలో సృష్టించే హింస, రక్తపాతం ఏస్థాయిలో ఉండనున్నాయో ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో అందరికీ అర్థమైపోయింది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

అలాగే ఈ సినిమా తర్వాత నాని,శ్రీకాంత్‌ ఓదెల కలయికలో ది ప్యారడైజ్‌ అనే ఓ భారీ పీరియాడిక్‌ డ్రామా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇది కూడా దసరా సినిమాకు మించిన వైల్డ్‌ యాక్షన్‌ తోనే సినీ ప్రియుల్ని అలరించనున్నట్లు సమాచారం.అదేవిధంగా స్టార్ హీరో చిరంజీవి ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.దీని తర్వాత ఆయన శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఒక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేయనున్నారు.

దీన్ని హీరో నాని నిర్మిస్తున్నారు.ఇదీ హింస, రక్తపాతంతో నిండిన యాక్షన్‌ కథతోనే ముస్తాబు కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

చిరు ఇందులో హింసలో శాంతిని వెతుక్కునే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నట్లు గతంలో ఇచ్చిన ప్రీలుక్‌ తో స్పష్టత ఇచ్చేశారు.ఇది వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.

వీరితోపాటు ఇంకా చాలామంది హీరోలు అంతకు మించిన యాక్షన్ చూపిస్తాము అని అంటున్నారు.

తాజా వార్తలు