Ram Charan : ఉపాసన ఒడిలో రామ్ చరణ్.. ఆ విషయంలో మాత్రం చరణ్ లక్కీ అంటూ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రామ్ చరణ్ తాజాగా తన 38వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే.

ఇక చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు అందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిసిందే.ఇక మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) కూడా తన కొడుకుకి స్పెషల్ గా విషెస్ చేశారు.

ఎంతమంది ఎన్ని విధాలుగా విష్ చేసిన ఉపాసన( upasana) ట్వీట్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూశారు.

అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.ఇక ఉపాసన ట్విట్టర్ ఖాతాలో రామ్ చరణ్ తను కలిసి దిగిన రెండు ఫోటోలు షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే బెష్టి అంటూ లవ్ సింబల్ ఎమోజిని షేర్ చేసింది.అయితే మొదటి ఫోటోలో గ్రీన్ కలర్ డ్రెస్ లో రామ్ చరణ్ ఉపాసన పక్క పక్కన కనిపించగా రెండో ఫోటోలో ఉపాసన ఒడిలో కూర్చొని రామ్ చరణ్ చిరునవ్వులు చిందించాడు.

Advertisement

అందులో రామ్ చరణ్ కాస్త స్టైలిష్ లుక్ లో కనిపించారు.ఆ ఫోటోని చూసిన అభిమానులు తెగ వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లి అయి పదేళ్లు అయిన సంగతి మనందరికీ తెలిసిందే.

త్వరలోనే బుల్లి రామ్ చరణ్ కూడా రాబోతున్నాడు.

త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరిన్ని సంతోషాలు రానున్నాయి.చెర్రీ బర్త్డే కీ ఈ రేంజ్ లో పండుగ చేసుకుంటే బుల్లి రామ్ చరణ్ వచ్చిన తర్వాత పండగ ఈ రేంజ్ లో ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంది.ఇకపోతే రామ్ చరణ్ గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్ ఈ సినిమాకు గాను ఆస్కార్ అవార్డుని అందుకొని గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక చరణ్ ఆస్కార్డ్ అవార్డుని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు