మామయ్య నన్ను ఎప్పుడూ ఆ విషయంలో ప్రశ్నించలేదన్న ఉపాసన

రామ్‌ చరణ్( Ram Charan ) భార్య ఉపాసన( upasana ) ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెల్సిందే.

పెళ్లి అయిన దాదాపు పదేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతున్నారు.

గత కొన్నాళ్లుగా ఉపాసన పిల్లలు కనడం లేదు అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అంతే కాకుండా చిరంజీవి కూడా పిల్లల విషయంలో ఉపాసనను ఒత్తిడి చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపించాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన మీడియాతో మాట్లాడారు.ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పిల్లల విషయంలో మామయ్య చిరంజీవి( Chiranjeevi ) గారు కానీ.

అత్తమ్మ గారు కానీ నన్ను ప్రశ్నించలేదు.నాకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు.

Advertisement
Upasana Interesting Comments About Chiranjeevi And Charan , Chiranjeevi, Charan,

చరణ్ కూడా ఈ విషయంలో నన్ను ఎప్పుడు ఒత్తిడి చేయలేదు అన్నారు.ఒక వయసు వచ్చిన తర్వాత.

కెరీర్ లో కొన్ని విషయాల్లో సెటిల్ అయిన తర్వాత మాత్రమే పిల్లలను కనాలని భావించాను.అందుకే నేను పిల్లల విషయంలో ఇన్నాళ్లు దూరంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా ప్రస్తుతం తాను గర్భవతిని అయినా కూడా ఎక్కువగా విశ్రాంతి తీసుకోకుండా నా పనులు నేను చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా కూడా ఉపాసన పేర్కొన్నారు.

Upasana Interesting Comments About Chiranjeevi And Charan , Chiranjeevi, Charan,

గర్భవతి అవ్వడం అనేది ప్రతి మహిళల యొక్క కోరిక.తాను కూడా చాలా కాలంగా తల్లి అవ్వాలని కోరుకున్నాను.ప్రతి విషయంలో కూడా కొందరు నన్ను విమర్శించడం పనిగా పెట్టుకున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఒకానొక సమయంలో నన్ను చరణ్ కేవలం ఆస్తికోసమే చేసుకున్నాడు అంటూ ట్రోల్స్ చేశారు.నా యొక్క అందం గురించి ఆ సమయంలో కొందరు అత్యంత దారుణంగా కామెంట్స్ చేశారు.

Advertisement

కానీ నేను మాత్రం ఎప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోలేదు.అప్పుడు నన్ను విమర్శించిన వారు ఇప్పుడు నన్ను అభిమానిస్తున్నాం అంటూ కామెంట్స్ పెడుతూ ఉంటారు అంటూ ఉపాసన పేర్కొన్నారు.

త్వరలోనే బిడ్డకు జన్మను ఇవ్వబోతున్న ఉపాసన చాలా ఎగ్జైట్‌ గా ఉన్నట్లుగా పేర్కొంది.

తాజా వార్తలు